కూలీ వెయ్యి కోట్ల ఆశ.. హిందీ పరిస్థితేంటి?
తమిళ సినిమాలు ఎన్నో ఏళ్లుగా సౌత్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నప్పటికీ హిందీ బెల్ట్ లో సాలిడ్ కలెక్షన్లు రాబట్టడంలో విఫలమవుతున్నాయి. దీనికి అనేక సమస్యలు ఉన్నాయని బాలీవడ్ ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
By: Tupaki Desk | 18 July 2025 6:00 PM ISTతమిళ సినిమాలు ఎన్నో ఏళ్లుగా సౌత్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నప్పటికీ హిందీ బెల్ట్ లో సాలిడ్ కలెక్షన్లు రాబట్టడంలో విఫలమవుతున్నాయి. దీనికి అనేక సమస్యలు ఉన్నాయని బాలీవడ్ ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సరైన డబ్బింగ్ ఉండకపోవడం, ఆకట్టుకునే ప్రమోషన్స్ చేయకపోవడం, 8 వారాల ఓటీటీ అగ్రిమెంట్ కు అంగీకరించకపోవడం లాంటివి ప్రధాన కారణాలు. దీంతో నేషన్ లెవెల్ లో మల్టీప్లెక్స్ చైన్ లలో సినిమాలు ఆడడం లేదు
అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఆగస్టు 14న చిత్రం విడుదల కానుంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. కూలీ వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లు వసూల్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి. కానీ, అది నెరవేరాలంటే మాత్రం హిందీలో మంచి వసూళ్లు సాధించడం అవసరం.
అందుకే పాత పద్దతులకు గుడ్ బై చెప్పి, సన్ పిక్టర్స్ తమ కొత్త సినిమా కూలీ హిందీ రిలీజ్ విషయంలో పక్కాగా ముందుకెళ్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ సంస్థ జయంతిలాల్ గడా పెన్ మరుధర్ బ్యానర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. గతంలో RRR, పొన్నియన్ సెల్వన్-1, విక్రమ్, సీతా రామం వంటి సౌత్ సూపర్ హిట్ సినిమాలు హిందీలో విడుదల చేసింది.
2.0 తర్వాత రజినీకాంత్ కు కూలీ హిందీలో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే అదే రోజు, వార్ 2 రిలీజ్ కూడా ఉండడంతో హిందీలో టఫ్ కాంపిటీషన్ ఉండడం పక్కా. ఇది అతిపెద్ద బాక్సాఫీస్ ఫైట్ కానుందని ట్రేడ్ వర్గాలు అంచానా వేస్తున్నాయి. అయితే కూలీ కంటెంట్ బలంగా ఉంటే కూలీ హిందీలోనూ రాణించే అవకాశం ఉంది. అమీర్ ఖాన్ ఉండడం నార్త్ లో కలిసొచ్చే అంశం.
గతంలో భారీ వసూళ్లు సాధించిన సౌత్ సినిమాలు బాహుబలి 2, KGF: చాప్టర్ 2, పుష్ప 2, RRR, కల్కి 2898 AD హిందీలో సక్సెస్ వల్లే రూ.1000 కోట్ల మార్క్ దాటాయి. ముఖ్యంగా కేజీఎఫ్ 2, పుష్ప ఓవరాల్ వసూళ్లలో 50% కంటే ఎక్కువ నార్త్ నుంచి వచ్చిందే. జైలర్ తో మంచి విజయం సాధించడం, లోకేష్ కనగరాజ్ చివరి చిత్రం లియో మల్టీప్లెక్స్ సపోర్ట్ లేకున్నా రూ. 25 కోట్లు సాధించడం కూలీకి కలిసొచ్చే అంశాలు. మౌత్ టాక్ బాగుంటే హిందీలో కూలీ ఈజీగా రూ.100 కోట్లు వసూల్ చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి మొదటిసారి ఒక తమిళ సినిమా 1000 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. మరి హిందీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
