Begin typing your search above and press return to search.

రజినీ 'కూలీ'.. అది కష్టంలా ఉందే!

రిలీజ్ కు ముందు ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అవ్వగా.. విడుదలయ్యాక మాత్రం సీన్ రివర్స్ అయింది.

By:  M Prashanth   |   25 Aug 2025 4:28 PM IST
రజినీ కూలీ.. అది కష్టంలా ఉందే!
X

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. ఆగస్టు 14వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదలైంది చిత్రం.

రిలీజ్ కు ముందు ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అవ్వగా.. విడుదలయ్యాక మాత్రం సీన్ రివర్స్ అయింది. సినీ ప్రియులను సాటిస్ఫై చేయలేకపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ జోష్ లో జరగడం వల్ల ఓపెనింగ్స్ వేరే లెవెల్ లో వచ్చాయి. ఆ తర్వాత రెండు రోజులు సెలవులు, వీకెండ్ కావడంతో మంచి కలెక్షన్స్ సాధించింది.

కానీ మండే నుంచి వసూళ్లు బాగా పడిపోయాయి. ఇప్పుడు ఈ వీకెండ్ ను బాగానే యూజ్ చేసుకుంది కూలీ. బ్లాక్ బస్టర్ హిట్ మహావతార నరసింహ తర్వాత బుకింగ్స్ విషయంలో ట్రెండింగ్ లో నిలిచింది. మోస్తరు కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు రూ.470 కోట్ల గ్రాస్ ను సినిమా రాబట్టినట్లు సమాచారం.

అయితే కూలీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.600 కోట్లు! దీంతో ఇప్పుడు ఆ మార్క్ ను టచ్ చేయాలంటే కష్టమే. లేకుంటే తమిళ వెర్షన్ కూడా ఫ్లాప్ గానే మిగులుతుంది. అయితే ఇప్పటి వరకు తెలుగుతో సహా ఇతర భాషల్లో కూలీ లాభాల్లోకి అడుగు పెట్టలేదు. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ కు తగ్గ వసూళ్లు ఇంకా రాబట్టలేదు.

కానీ వార్-2 కన్నా ఎక్కువ సాధిస్తోంది. అయితే మేకర్స్ మాత్రం సినిమాను హిట్ జోన్ లో తీసుకురావాలని వర్క్ చేస్తున్నారని సమాచారం. రీసెంట్ గా సెన్సార్ సర్టిఫికెట్ పై కోర్టుకు వెళ్లారు. తమకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారని.. యూ/ఏ కావాలని కోరారు. యూ/ఏ అయితే ఆక్యుపెన్సీలతో థియేటర్లు మళ్లీ నిండుతాయని భావిస్తున్నారు.

కానీ అది అంత ఈజీ కాదు. మిక్స్డ్ టాక్ పాజిటివ్ గా మారిపోవడం కష్టమే. కానీ కూలీ మూవీ ఇంకాస్త స్టడీగా సాగితే లాభాలు విషయం పక్కనపెడితే బయ్యర్లు సేఫ్ అవుతారు. లేకుంటే అంతా నష్టాల బారిన పడతారు. రజినీ కాంత్ అకౌంట్ లో ఫ్లాప్ చేరుతుంది. మరి కూలీ సినిమా విషయంలో చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.