Begin typing your search above and press return to search.

30 ఏళ్ల క్రితం సంచ‌ల‌నాన్ని చూపించారా!

ఈ నేప‌థ్యంలోనే 'చికిటు' అనే పాట‌ను రిలీజ్ చేసారు. పాట‌లో మ‌రోసారి ర‌జ‌నీ మార్క్ హుక్ స్టెప్స్ తో అల‌రిస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 July 2025 12:29 PM IST
30 ఏళ్ల క్రితం సంచ‌ల‌నాన్ని చూపించారా!
X

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో 'కూలీ' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సినిమాపై అంచనాలు భారీగా ఏర్ప‌డ్డాయి. అనిరుద్ సంగీతం అందించ‌డం సినిమా కు అద‌న‌పు అస్సెట్. ఇలా ముగ్గురు కాంబినేష‌న్ లో రాబోతున్న మ‌రో సినిమా కావ‌డంతో? పాన్ ఇండియాలో అంచ‌నాలు పీక్స్ కు చేరుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌చారం ప‌నులు కూడా మొద‌ల‌య్యాయి లిరికల్ సింగిల్స్ ఒక్కొక‌టిగా రిలీజ్ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే 'చికిటు' అనే పాట‌ను రిలీజ్ చేసారు. పాట‌లో మ‌రోసారి ర‌జ‌నీ మార్క్ హుక్ స్టెప్స్ తో అల‌రిస్తున్నారు. ఇదే పాట‌లో అనిరుద్ కూడా ర‌చ్చ చేసాడు. ర‌జ‌నీ కంటే ఎక్కువ‌గా అనిరుద్ హైలైట్ అవుతున్నాడు. తాజాగా ఈ పాట‌కు సంబంధించిన అనుభ‌వాన్ని అనిరుద్ గుర్తు చేసుకున్నాడు. 'ఇందులో వింటేజ్ ర‌జ‌నీకాంత్ ని చూస్తారు. ఆ పాట కోసం ర‌జనీ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. పాట‌ను స‌వాల్ గా తీసుకుని ప‌ని చేసారు.

ర‌జ‌నీ కాంత్ షూటింగ్ కి ముందు ఎప్పుడు పాట‌లు విన‌రు. `హుకుం` పాట త‌ప్ప ఏదీ విన‌లేదు. కానీ కూలీలో `చికిటు` పాట ముందే విన్నారు. ఆ పాట‌లో ఆయ‌న డాన్స్ చూస్తే ఎంత ఎంజాయ్ చేసారో తెలుస్తుంది. వింటేజ్ స్టైల్లో అద‌ర‌గొట్టారు. 30 ఏళ్ల క్రితం నాటి ర‌జ‌నీ మ‌ళ్లీ క‌నిపిస్తారు` అని అన్నాడు. అనిరుద్ సంగీతం అంటే ర‌జ‌నీకాంత్ కు ఎక్క‌డ‌లేని ఉత్సాహం వ‌స్తుంది.

'జైల‌ర్' సినిమాకు కూడా ర‌జ‌నీ అంతే ఎన‌ర్జీతో ప‌నిచేసారు. పాత రోజుల్లో ర‌జ‌నీ సినిమా పాట‌ల్లో ఓ వైబ్ క‌నిపించేది. కానీ కాల‌క్ర‌మంలో కంటెంట్ తో పాటు ఆయ‌న సినిమా పాట‌ల్లో నాణ్య‌త త‌గ్గింది. మ‌ళ్లీ అనిరుద్ ఎంట్రీతో పూర్వ వైభ‌కం క‌నిపిస్తుంది. అందుకే ర‌జ‌నీకాంత్ త‌న ప్ర‌తీ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఉండేలా చూసుకుంటున్నారు.