రజనీ `కూలీ` కోసం `యానిమల్` ఫార్ములా?
క్రేజీ సూపర్ స్టార్‌ల సినిమాల్లోకి హై రిస్క్ సీన్‌ల కోసం కొంత కాలంగా వారి డూప్‌లని వాడుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 13 May 2025 1:30 PMక్రేజీ సూపర్ స్టార్‌ల సినిమాల్లోకి హై రిస్క్ సీన్‌ల కోసం కొంత కాలంగా వారి డూప్‌లని వాడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్ డూప్ వార్తల్లో నిలిచి హాట్ టాపిక్ గా నిలవడం, వార్ 2 సినిమాని రెమ్యునరేషన్ విషయంలో ఏర్పడిన సమస్యల కారణంగా రిజెక్ట్ చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ బాడీ డబుల్ టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ `కూలీ` మూవీలో నటిస్తున్నారు.
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా భారీ యాక్షన్ థ్రిల్లర్ `కూలీ`ని తెరకెక్కిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శృతిహాసన్‌తో పాటు కీలక నటీనటులు నటిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాని గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు.
బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ కీలక అతిథి పాత్రలో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న ఈ మూవీ కోసం రజనీ బాడీ డబుల్‌ని వాడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రజనీ వయసు 74 ఏళ్లు దాటింది. దీంతో యాక్షన్ సన్నివేశాల్లో ఆయన నటించడం అంత శ్రేయస్కరం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పలు యాక్షన్ సన్నివేశాల్లో రజనీ బాడీ డబుల్‌ని లోకేష్ కనగరాజ్ వాడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై టీమ్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
దీంతో జరుతున్న ప్రచారం నిజమేనని అంతా భావిస్తున్నారు. యానిమల్ మూవీతో బాడీడబుల్ అనే ఫార్ములా బాగా పాపులర్ కావడంతో ఇప్పుడు డూప్ అనే పదం ఎక్కడా వాడటం లేదు. యానిమల్ ఫార్ములాని ఇప్పుడు రజనీ కోసం `కూలీ` టీమ్ వాడటం ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలోని ఓ ఐటమ్ నంబర్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే మెరిసి సర్‌ప్రైజ్ చేయబోతోంది. `ఎఫ్ 2` తరువాత పూజా హెగ్డే చేస్తున్న సెకండ్ ఐటమ్ నంబర్ ఇదే కావడం గమనార్హం.