Begin typing your search above and press return to search.

రజినీ 'కూలీ'.. మళ్లీ ఆ హీట్ రిపీట్ అవుతుందా?

సినిమాలో కంటెంట్ ఉండడంతో బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. అయితే కూలీ విషయానికొస్తే.. ఇప్పటికే మూవీపై భారీ బజ్ ఉంది.

By:  Tupaki Desk   |   3 July 2025 1:00 AM IST
రజినీ కూలీ.. మళ్లీ ఆ హీట్ రిపీట్ అవుతుందా?
X

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇప్పుడు కూలీ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఆ సినిమా.. వచ్చే నెలలో థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లీట్ చేస్తున్నారు.

ఆగస్టు 14వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఆ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో భారీగా ప్రమోషన్స్ ను చేపట్టనున్నారు. అందులో భాగంగా జూలై 27వ తేదీన చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మేకర్స్ ఆడియో లాంచ్ ఫంక్షన్ నిర్వహించనున్నారని తెలుస్తోంది.

అందుకు గాను అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారట. అదే సమయంలో ఇప్పుడు రజినీకాంత్ స్పీచ్ పై అందరి ఫోకస్ పడింది. ఈ సారి కూలీ ఈవెంట్ లో ఎలా మాట్లాడుతారో.. ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తారోనని డిస్కస్ చేసుకుంటున్నారు.

ముఖ్యంగా జైలర్ మూవీ ఆడియో లాంచ్ ఫంక్షన్ లో రజినీ ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి.. జైలర్ సినిమాకు ఆడియో లాంచ్ ఈవెంట్ కు ముందు బజ్ తక్కువగా ఉంది. కానీ ఎప్పుడైతే రజినీ కార్యక్రమంలో మాట్లాడారో.. ఒక్కసారి సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఓ రేంజ్ లో నెలకొంది.

సినిమాలో కంటెంట్ ఉండడంతో బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. అయితే కూలీ విషయానికొస్తే.. ఇప్పటికే మూవీపై భారీ బజ్ ఉంది. మేకర్స్ ఇచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీ సూపర్ హిట్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. రజినీ ఖాతాలో భారీ హిట్ పడుతుందని డిసైడ్ అయ్యారు.

ఇప్పుడు కూలీ ఈవెంట్ లో మరోసారి రజినీ ఎఫెక్టివ్ స్పీచ్ ఇస్తే.. సినిమాపై ఇంకా అంచనాలు పెరుగుతాయి. వేరే లెవెల్ బజ్ క్రియేట్ అవుతుంది. ఈవెంట్ గా హైలెట్ గా నిలుస్తూ.. అందరి ఫోకస్ మూవీపై పడేలా చేస్తుంది. సినిమాలో కంటెంట్ ఉంటే ఓ రేంజ్ హిట్ కూడా అవుతుంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.