కూలీ 'తెలుగు' రైట్స్ ఆయనకే దక్కాయా?
తాజా సమాచారం ప్రకారం, ఆసియన్ సునీల్ కూలీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఫ్యాన్సీ ఆఫర్ కు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 23 Jun 2025 9:23 PM ISTకోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో కూలీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జునతో పాటు ఉపేంద్ర, సాబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్ సహా అనేక మంది సినిమాలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గ్రాండ్ గా నిర్మిస్తున్న కూలీ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల క్రితం మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే కూలీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుండగా.. తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. రూ.40-45 కోట్ల డీల్ అని.. థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అన్నపూర్ణ స్టూడియోస్ తరపున నాగార్జున కూలీ రైట్స్ ను కొన్నారని టాక్ వినిపించింది.
ఆ తర్వాత అది నిజం కాదని తెలిసింది. అన్నపూర్ణ స్డూడియోస్ తో పాటు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, దిల్ రాజు, ఆసియన్ సునీల్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పోటీ పడుతున్నాయని రీసెంట్ గా వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజా సమాచారం ప్రకారం, ఆసియన్ సునీల్ కూలీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఫ్యాన్సీ ఆఫర్ కు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే.. ఆసియన్ సునీల్ రజనీకాంత్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన జైలర్ ను డిస్ట్రిబ్యూషన్ ప్రాతిపదికన విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఆ మూవీతో భారీగా లాభాలు అందుకున్నారు. ఇప్పుడు సన్ పిక్చర్స్ సంస్థ తో కూలీ మూవీకి గాను డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
అదే నిజమైతే.. కూలీ తెలుగులో ఆసియన్ సినిమాస్ ద్వారా గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అందుకు తగ్గట్లే మేకర్స్.. మూవీని ప్రమోట్ చేస్తున్నారు. మరి కూలీ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో.. తెలుగులో ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.