తీర్థయాత్ర స్థలంలా రజనీ 35 కోట్ల ఇల్లు
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. సూపర్ స్టార్ రజనీకాంత్ నికర ఆస్తుల విలువ సుమారు 430కోట్లు. ఆయనకు రూ. 35 కోట్ల ఖరీదు చేసే ఇల్లు చెన్నైలో ఉంది.
By: Tupaki Desk | 14 April 2025 9:59 AM ISTఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. సూపర్ స్టార్ రజనీకాంత్ నికర ఆస్తుల విలువ సుమారు 430కోట్లు. ఆయనకు రూ. 35 కోట్ల ఖరీదు చేసే ఇల్లు చెన్నైలో ఉంది. షారూఖ్ మన్నత్ లా దీని ప్రత్యేకత దీనికి ఉంది. ఈ భవనం లోపల పరిశీలిస్తే ఇది రాజభవనమా లేక తీర్థయాత్ర స్థలమా? అని అందరూ ఆశ్చర్యపోతారు.
చెన్నై- పోయెస్ గార్డెన్‌లోని 18 రాఘవవీర అవెన్యూలో ఉన్న రజనీకాంత్ భవనం విలాసవంతంగా ఉండటమే కాదు.. అది జ్ఞాపకాల సమ్మేళనం. సుమారు రూ. 35 కోట్ల విలువైన ఈ ఇల్లు సూపర్‌స్టార్ దర్పం కంటే, వినయానికి సింబాలిక్‌గా కనిపిస్తుంది. ఫ్యామిలీ ఫోటోలు, రజనీ పెంచిన మొక్కలు వ్యక్తిగత స్పర్శతో ఆకట్టుకుంటాయి. ఒక సాధారణ బస్ కండక్టర్ నుండి ప్రపంచ స్థాయి సెలబ్రిటీకి చిహ్నంగా అతడి ప్రయాణాన్ని కూడా ఈ ఇల్లు ప్రతిబింబిస్తుంది. బలమైన ధాతృత్వ వారసత్వం ఇక్కడ కనిపిస్తుంది.
చెన్నై పోయెస్ గార్డెన్‌లోని 18 రాఘవవీర అవెన్యూ కేవలం రజనీ ఇంటి చిరునామా కాదు. సూపర్‌స్టార్‌డమ్‌కు విరామం తెలియని వ్యక్తికి ఇది సజీవ నివాళి. ఇది దక్షిణాది మన్నత్ అంటే అతిశయోక్తి కాదు. చెన్నైకి బెవర్లీ హిల్స్ వెర్షన్ ఉంటే, పోయెస్ గార్డెన్ అలాగే ఉండేది. విలాసవంతమైన బంగ్లాలు, నిశ్శబ్దమైన రోడ్లు, నిశ్శబ్ద ప్రాముఖ్యత కలిగిన వాతావరణం.
రజనీ పోయెస్ గార్డెన్ కు మారినప్పటి నుండి, ఈ ప్రాంతంలో ఆస్తి ధరలు పెరిగాయ. ఈ వీధిలో సూపర్‌స్టార్ ఒక్కరే కాదు. చాలా మంది ఉన్నారు. అభిమానులు నిత్యం గేట్ల దగ్గర తిరుగుతూ ఉంటారు. సూపర్ స్టార్ ఒక సాధారణ వ్యక్తిలా తన మొక్కలకు నీళ్లు పోస్తాడు. సాధారణ జీవితం గడుపుతుంటే, లెజెండరీ నటుడు రజనీ చేస్తున్న పనుల్ని జనం చూడాలనుకుంటారు.
రజనీ లివింగ్ రూమ్ ఆధునికతతో ఉండదు. ఇది చెక్కతో చేసినది.. భావోద్వేగాలతో నిండి ఉంటుంది. రజనీ తల్లిదండ్రుల ఫోటోలు, కుటుంబ ఫోటోలు, సాంప్రదాయ చెక్క ప్యానెల్‌లు ఉంటాయి. మెరుపుల షాన్డిలియర్లు .. పాలరాయి గోడలను ఆశించినట్లయితే ఎవరైనా మరోసారి ఆలోచించండి. ఇది ప్యాలెస్ కాదు. ఇది జ్ఞాపకాల ఆలయం.
సూపర్‌స్టార్ వంటగది ఎలా ఉంటుంది? రోబోటిక్ చేతులు.. తేలియాడే అల్మారాలు! అని చెప్పుకునేలా ఉండదు... రజనీకాంత్ వంటగది అంతా హృదయంతో ప్రాచీన వారసత్వంతో అలరిస్తుంది. సాంప్రదాయ గ్రానైట్ స్లాబ్‌లు ఎలక్ట్రిక్ చిమ్నీ లాంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. రజనీ తన ఉదయపు ఫిల్టర్ కాఫీని తయారు చేసే ప్రదేశం కూడా ఉంది.
చుట్టుపక్కల పచ్చదనంతో తీర్చిదిద్దిన ఈ ఇల్లు కేవలం ఒక ఆశ్రయం మాత్రమే కాదు - ఇది ఒక అభయారణ్యం. చిన్న అడవులు, కిచకిచలాడే పక్షులు , ప్రశాంతమైన నడక మార్గం ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. యోగా స్టూడియో కూడా ఉంది.
రజనీకాంత్ ఇంటి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ. 35 కోట్లు. కానీ దీనిని డబ్బుతో కొలవకూడదు. భావోద్వేగ విలువను చూడాలి. ఈ ఇల్లు కేవలం ఆస్తి కాదు.. ఇది బస్సు టిక్కెట్లతో ప్రారంభమై బ్లాక్‌బస్టర్ స్క్రిప్ట్‌లతో ఎదిగిన ప్రయాణానికి చిహ్నం.
