రజనీ 173 చుట్టూ నాన్నా పులి ఆట!
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `జైలర్ 2`. `జైలర్`కు మించి క్రేజీ స్టార్స్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
By: Ravindar Gorantla | 18 April 2026 10:00 PM ISTసూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `జైలర్ 2`. `జైలర్`కు మించి క్రేజీ స్టార్స్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాపై పైరసీ పంజా విసిరింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు ఆన్ లైన్‌లో లీక్ కావడం కలకలం రేపుతోంది.
దీనిపై సీరియస్‌గా స్పందించిన మేకర్స్ సదరు వీడియోలని షేర్ చేసినా, సమాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా పూర్తి చేసిన తరువాత మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లని మొదలు పెట్టాలనుకున్న రజనీకాంత్‌కు డైరెక్టర్స్ సమస్య తీవ్ర తలనొప్పులు తెచ్చి పెడుతోంది. `జైలర్ 2` తరువాత రజనీ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో కమల్ నిర్మించనున్న భారీ యాక్షన్ డ్రామాని స్టార్ట్ చేయాలి.
దీనికి ముందు సుందర్ సిని డైరెక్టర్‌గా అనుకున్నారు. అయితే అధికారిక ప్రకటన చేసిన పది రోజుల లోపే సుందర్ సి వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి షాక్ ఇచ్చారు. తాను పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్‌లు మధ్యలోనే ఉన్నాయని, అవి పూర్తి చేయడం కోసమే తాను ఈ ప్రాజెక్ట్‌ని వదులుకుంటున్నట్టుగా ప్రకటించడంతో రజనీ 173 డైరెక్టర్ ఎవరు? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రజనీ మూవీని సిబి చక్రవర్తి డైరెక్ట్ చేస్తాడంటూ కమల్ నుంచి ప్రకటన వచ్చింది.
అప్పటి నుంచి దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది. రజనీకి సంబంధించిన గెటప్‌ల కోసం సిబి చక్రవర్తి 80 గెటప్‌ల వరకు రెడీ చేయించడాని, అందులో ఏది ఫైనల్ అయితే దాన్ని సినిమా కోసం ఫైనల్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఏదీ జరగలేదు. ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ లోకి `డ్రాగన్` ఫేమ్ అశ్వత్ మారిముత్తు వచ్చి చేరాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్‌లో భారీ మార్పులు చేస్తున్నారని, అవి అశ్వత్ మారిముత్తు నేతృత్వంలో జరుగుతున్నాయని చెబుతున్నారు.
`డ్రాగన్` ఫేమ్ అశ్వత్ మారిముత్తు ఈ ప్రాజెక్ట్‌లోకి ప్రవేశించిన దర్శకుడు శిబి చక్రవర్తి తప్పుకోలేదని, తను కూడా వర్క్ చేస్తున్నాడట. ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన `ధురంధర్` ఫార్ములాతో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో సరికొత్తగా తెరకెక్కించాలని టీమ్ ప్లాన్ చేస్తోందట. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే వరకు ఫైనల్‌గా స్టార్ట్, యాక్షన్, కట్ చెప్పేది ఎవరన్నది కన్ష్యూజన్‌గా ఉందని రజనీ అభిమానులు చెబుతున్నారు. అప్పటికైనా ఈ ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న నాన్నా పులి కథకు ఎండ్ కార్డ్ పడుతుందా? లేక ఫైనల్‌గా మరో డైరెక్టర్ లైన్‌లోకి వచ్చేస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.
