Begin typing your search above and press return to search.

ఫెయిల్యూర్‌ డైరెక్టర్ అవసరమా అన్నారు : రజినీకాంత్‌

కానీ నెల్సన్ మాత్రం మంచి స్క్రిప్ట్‌ తో రావడంతో నేను ఓకే చెప్పాను.

By:  Tupaki Desk   |   29 July 2023 11:16 AM GMT
ఫెయిల్యూర్‌ డైరెక్టర్ అవసరమా అన్నారు : రజినీకాంత్‌
X

తమిళ్ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ 'జైలర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఆగస్టు 11న రాబోతున్న జైలర్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో భారీ ఎత్తున జరిగింది.

ఈ వేడుకలో రజినీకాంత్ పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్‌ లో ఆడే తీరు మొదలుకు పలు విషయాల గురించి రజినీకాంత్ వ్యాఖ్యలు చేశాడు.

రజినీకాంత్‌ దర్శకుడు నెల్సన్‌ దిలీప్ గురించి మాట్లాడుతూ... బీస్ట్‌ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన తర్వాత నెల్సన్‌ నన్ను కలిశాడు. అతడు చెప్పిన స్టోరీ లైన్ నచ్చింది. దాంతో పూర్తి స్క్రిప్ట్‌ తో రమ్మని చెప్పాను.

కొన్ని రోజుల్లోనే నా వద్దకు మంచి స్క్రిప్ట్‌ తో వచ్చాడు. చాలా మంది మంచి స్టోరీ లైన్ చెప్పి స్క్రిప్ట్‌ మాత్రం సరిగా రాసుకుని రారు. కానీ నెల్సన్ మాత్రం మంచి స్క్రిప్ట్‌ తో రావడంతో నేను ఓకే చెప్పాను.

సినిమా ప్రకటన వచ్చిన తర్వాత బీస్ట్‌ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ఫలితం తేడా కొట్టడంతో అతడి దర్శకత్వంలో సినిమా అవసరమా అంటూ నన్ను చాలా మంది ప్రశ్నించారు. ఆయన ఇప్పటి వరకు పెద్ద సినిమాలు చేయలేదు.. చేసిన ఒక్క సినిమా కూడా నిరాశ పరిచింది కనుక మీరు అతడి తో సినిమా చేయక పోవడం మంచిదని చాలా మంది నాతో అన్నారు.

నేను మాత్రం అతడితో సినిమా ను చేయాలని బలంగా ఫిక్స్ అయ్యాను. అతడి స్క్రిప్ట్‌ చెప్పిన విధంగా నచ్చిందని రజినీకాంత్‌ చెప్పుకొచ్చాడు. బీస్ట్‌ కు కమర్షియల్‌ గా మంచి నెంబర్స్ నమోదు అయ్యాయి. అందుకే నేను అతడిని నమ్మాను. సన్ పిక్చర్స్ వారు కూడా నా మాటకు ఓకే చెప్పి నెల్సన్‌ దర్శకత్వంలో సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని రజినీకాంత్‌ అన్నాడు.