Begin typing your search above and press return to search.

సినిమా బాలేదు అన్నందుకు చితకొట్టిన అభిమానులు!

అయితే ఇదే వేడిలో ఓ ప్రేక్ష‌కుడు సినిమా థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కొచ్చి 'జైలర్' బాలేద‌ని కామెంట్ చేసాడు.

By:  Tupaki Desk   |   10 Aug 2023 4:50 PM GMT
సినిమా బాలేదు అన్నందుకు చితకొట్టిన అభిమానులు!
X

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన 'జైల‌ర్' నేడు భారీ అంచ‌నాల మ‌ధ్య‌ ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో సూప‌ర్ స్టార్ అభిమానుల థియేట‌ర్ వ‌ద్ద బారులు తీరారు. టిక్కెట్ ఉన్నా..లేక‌పోయినా 'జైలర్' ప్యాన్ మూవె మెంట్ ని ఆస్వాదించ‌డానికి థియేట‌ర్ కి వెళ్లిన అభిమానులెంతో మంది. సినిమా చూసొచ్చిన అభిమానులు ఓవైపు...టిక్కెట్ లేకుండా హ‌డావుడి చేసిన అభిమానులు మ‌రోవైపు తో త‌మిళ‌నాడు థియేట‌ర్ల‌న్ని కిట‌కిట‌లాడాయి.

అయితే ఇదే వేడిలో ఓ ప్రేక్ష‌కుడు సినిమా థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కొచ్చి 'జైలర్' బాలేద‌ని కామెంట్ చేసాడు. దీంతో ర‌జ‌నీ అభిమానులు అత‌ని పై రెచ్చిపోయారు. విచ‌క్ష‌ణ ర‌హితంగా అత‌నిపై తీవ్ర స్థాయిలో దాడికి తెగ‌బ‌డ్డారు. సినిమా బాలేదంటావా? నిజంగా సినిమా చూసావా? లేక కారుకూత‌లు కూస్తున్నావా? అంటూ దాడికి దిగారు. దీంతో చుట్టూ ఉన్న ప్రేక్ష‌కులు కొంత మంది బాధితుడిని కాపాడే ప్ర‌య‌త్నం చేసారు. అభిమానుల‌కు అడ్డుగా వెళ్లి వ‌దిలేయండ‌ని బ్ర‌తిమ‌లాడారు.

దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటి జ‌నులు భ‌గ్గుమంటున్నారు. సినిమా బాలేదంటే ఇలా దాడి చేస్తారా? మీరు ర‌జ‌నీ అభిమానులేనా? అంటూ మండిప‌డుతున్నారు. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి ప్ర‌భాస్ న‌టించిన 'ఆదిపురుష్' రిలీజ్ డే రోజున చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌సాద్ ఐమాక్స్ థియేటర్ వద్ద ఓ వ్యక్తి 'ఆది పురుష్' సినిమా బాగాలేదని యూట్యూబ్ ఛానల్ ద్వారా రివ్యూ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసాడు.

దీంతో అభిమానులు అతన్ని చితక్కొట్టారు. సినిమాపై నెగిటివ్ రివ్యూ ఏంట‌ని బెదిరించి దాడికి దిగారు. అలాగే ఓ థియేట‌ర్ లో సౌండ్ సిస్ట‌మ్ స‌రిగ్గా లేద‌ని థియేట‌ర్ ని డార్లింగ్ అభిమానులు ధ్వంసం చేసారు. భ్రమరాంబ థియేటర్లో కూడా ఇలాగే ఓ ప్రేక్షకుడిపై దాడి జరిగింది. హనుమంతుడికి కేటాయించిన సీట్లో కూర్చున్నాడని అగ్ర‌హించి అభిమానులు అతనిపై దాడి చేశారు.

దీంతో త‌మిళ‌నాడు-తెలుగు రాష్ట్రాల్లో హీరోల అభిమానులు పెట్రేగిపోవ‌డంపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏ రాష్ట్రంలోనూ సామాన్యుల‌పై ఇలాంటి దాడులు చోటు చేసుకోలేద‌ని కేవ‌లం త‌మిళ‌నాడు-తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి ప‌రిస్థితులు దాప‌రించాయ‌ని మండిపుడుతున్నారు. ఇలాంటి దాడుల‌పై హీరోలు స్పందించాల‌ని నెటి జ‌నులు డిమాండ్ చేస్తున్నారు.