Begin typing your search above and press return to search.

తన రికార్డును తనే బ్రేక్ చేసుకున్న తలైవా

కోలీవుడ్ లో రజినీకాంత్ రికార్డులు బ్రేక్ చేయాలంటే మళ్ళీ రజినీకాంత్ మాత్రమే అవ్వాలని ప్రస్తుతం జైలర్ సినిమాకి వస్తోన్న కలెక్షన్స్ తో స్పష్టం అవుతోంది.

By:  Tupaki Desk   |   12 Aug 2023 4:17 AM GMT
తన రికార్డును తనే బ్రేక్ చేసుకున్న తలైవా
X

సూపర్ స్టార్ రజినీకాంత్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో చేసిన జైలర్ థియేటర్స్ లోకి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ వస్తూ ఉండటం విశేషం. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చిందనే మాట వినిపిస్తోంది.

సరైన కథ పడితే రజిని రేంజ్ ని కోలీవుడ్ లో ఏ హీరో కూడా అందుకోలేరని జైలర్ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. ఈ మూవీ కనీసం 400 కోట్ల కలెక్షన్స్ ని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. వీకెండ్ లోనే 200 కోట్ల గ్రాస్ ని దాటిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. వీకెండ్ అయ్యేసరికి రికార్డులు బద్దలవుతాయని భావిస్తున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో, సూపర్ స్టార్ రజినీకాంత్ కెరియర్ లో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే జైలర్ తో చాలా సినిమాలు రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి.

కోలీవుడ్ లో ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా అంటే సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో 2.ఓ మూవీ ఇప్పటికి టాప్ లో ఉంది. ఈ చిత్రం ఏకంగా 95 కోట్ల గ్రాస్ ని మొదటి రోజు కలెక్ట్ చేసింది. దీని తర్వాత స్థానంలోకి ఇప్పుడు జైలర్ మూవీ వచ్చి చేరింది. 91.20 కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం మొదటి రోజు సాధించడం విశేషం. మూడో స్థానంలో విజయ్ బీస్ట్ మూవీ 86.15 కోట్లతో నిలిచింది. ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాల రికార్డులు జైలర్ తో వెనక్కి పోయాయి.

మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీ కూడా ఈ స్థాయిలో ఓపెనింగ్స్ తెచ్చుకోలేదు. కోలీవుడ్ లో రజినీకాంత్ రికార్డులు బ్రేక్ చేయాలంటే మళ్ళీ రజినీకాంత్ మాత్రమే అవ్వాలని ప్రస్తుతం జైలర్ సినిమాకి వస్తోన్న కలెక్షన్స్ తో స్పష్టం అవుతోంది. మిగిలిన హీరోలు అందరూ సెకండ్ పొజిషన్ కోసం పోటీ పడాల్సిందే తప్ప సూపర్ స్టార్ ని ఇప్పట్లో అందుకోలేరని సినీ విశ్లేషకులు అంటున్నారు.

లాంగ్ రన్ లో కూడా జైలర్ మూవీ కోలీవుడ్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ రికార్డుని అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వీకెండ్ లో అయితే కలెక్షన్స్ భారీగానే వస్తాయి. వీకెండ్ పూర్తయిన తర్వాత ఏ స్థాయిలో సినిమా పట్ల ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారనేదానిపై ఈ మూవీ ఏ రేంజ్ హిట్ అనేది తెలిసే ఛాన్స్ ఉంది. కచ్చితంగా 500 కోట్ల గ్రాస్ ని జైలర్ అందుకుంటుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట.