Begin typing your search above and press return to search.

రొటీన్ కథతో 500 కోట్లు.. అదే సరైన సినిమా పడితే..!

అదే ఒక మంచి కథతో రజిని సినిమా వస్తే ఈ వసూళ్లు డబుల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   19 Aug 2023 3:15 AM GMT
రొటీన్ కథతో 500 కోట్లు.. అదే సరైన సినిమా పడితే..!
X

సూపర్ స్టార్ రజిని లేటెస్ట్ రిలీజ్ జైలర్ బాక్సాఫీస్ పై తన దూకుడు చూపిస్తున్నాడు. ఆగష్టు 10న రిలీజైన ఈ సినిమా 4 రోజుల్లో 300 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయగా ఇండిపెండెన్స్ డే హాలీడే కూడా కలిసి రావడంతో నిన్నటి వరకు 450 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ రికార్డులు అన్నీ ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తూ జైలర్ దూసుకెళ్తున్నాడు. సూపర్ స్టార్ రజిని ఫ్యాన్స్ కూడా జైలర్ వసూళ్లను చూసి పండుగ చేసుకుంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే రోబో 1 తర్వాత రజిని సినిమాలు అన్నీ నిరాశపరిచాయి.

2.O పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా ప్రాఫిట్స్ తీసుకు రాలేదు. కబాలి కేక పెట్టించినా ఆ ప్రభావం కలెక్షన్స్ లో కనిపించలేదు. ఇక కాలా, 2.ఓ, పేట, దర్బార్, అన్నాత్తే ఇలా అన్ని సినిమాలు లాసులతోనే ముగిశాయి. జైలర్ సినిమా కూడా రిలీజ్ ముందు పెద్దగా బజ్ లేదు కానీ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. నెల్సన్ దిలీప్ కుమార్ రజినితో ఒక రెగ్యులర్ సినిమా చేసినా ఈ రేంజ్ వసూళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా రజిని సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించి చాలా కాలమైంది.

దాదాపు 13 ఏళ్ల క్రితం రోబో 1 యంతిరన్ తో రజిని ఈ రేంజ్ వసూళ్లను రాబట్టాడు. సరైన కథ లేకుండానే జస్ట్ రజిని స్వాగ్ తో జైలర్ కలెక్షన్స్ తో దున్నేస్తున్నాడు. అదే ఒక మంచి కథతో రజిని సినిమా వస్తే ఈ వసూళ్లు డబుల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఎలాగు జైలర్ తో తను ఎలాంటి సినిమా చేస్తే ఫ్యాన్స్ చూడాలని అనుకుంటున్నారో క్లారిటీ వచ్చిన రజిని జైలర్ తర్వాత నుంచి తన రేంజ్ కి తగిన సినిమాలే చేస్తాడని చెప్పొచ్చు.

జైలర్ తర్వాత లాల్ సలాం సినిమా చేస్తున్నాడు రజినికాంత్. ఆ సినిమా రజిని కూతురు ఐశ్వర్య రజినికాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రజిని క్యామియో రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. రజినికాంత్ లాల్ సలాం సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ నటిస్తున్నారు. జైలర్ తర్వాత రజిని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి ఏ డైరెక్టర్ తో సూపర్ స్టార్ సినిమా ఉంటుంది అన్నది చూడాలి. జైలర్ తో ఫాం లోకి వచ్చిన రజిని రానున్న సినిమాలతో ఇదే ఫాం కొనసాగిస్తాడేమో చూడాలి.