వాళ్లు అలా..వీళ్లు ఇలా..అసలెందుకిలా!
స్టార్ హీరోతో సినిమా అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. తెరంతా తానే హైలైట్ అవ్వాలి.
By: Tupaki Desk | 15 July 2025 4:00 AM ISTస్టార్ హీరోతో సినిమా అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. తెరంతా తానే హైలైట్ అవ్వాలి. అది సీన్ అయినా? పాట అయినా సరే? డైరెక్టర్ ఆ విధంగానే హీరోని ఎలివేట్ చేస్తాడు. అలా చేయకపోతే హీరో కూడా ఒప్పుకోడు. అర్దంతరంగా ప్రాజెక్ట్ ఆగిపోయినా ఆగిపోతుంది. కారణమేమి అంటే? క్రియేటివ్ డిఫరెన్స్ అనే ఓ కారణం తెరపైకి వస్తుంది. ఇది తెలుగు సినిమాకు ఓ ఫార్ములా లా మారిపోయింది. ఇప్పటికీ ఇదే విధానంలో తెలుగు సినిమా ఫార్మెట్ కనిపిస్తుంది. కానీ కోలీవుడ్ ఇందుకు కాస్త భిన్నంగా ఉంటుంది.
కొన్ని కేసెస్ లో సైడ్ క్యారెక్టర్లు కూడా హైలైట్ అవుతుంటాయి. సీన్ లో అయినా...సాంగ్ లో అయినా? పేరు తెలియని నటులు హైలైట్ అవుతుంటారు. తాజాగా రిలీజ్ అయిన `కూలీ` స్పెషల్ సాంగ్ మోనికా పాటలో లో పూజాహెగ్డే తో పాటు, మలయాళ నటుడు షౌబిన్ షాహిర్ కూడా హైలైట్ అయ్యాడు.పూజతో పాటు పోటీగా స్టెప్ అందుకున్నాడు. ఈ సందర్భంగా కొంతమంది రజనీకాంత్ అభిమానులు సోషల్ మీడియాలో మోనికా పాటలో షౌబిన్ షాహిర్ స్క్రీన్ టైమింగ్ గురించి చర్చించడం మొదలు పెట్టారు.
షాబిన్ అంతగా హైలైట్ అవ్వడానికి కారణం తమ అభిమాన హీరో రజనీ అంటూ హైలైట్ చేస్తున్నారు. తన సినిమాల్లో ఇతరులకు కూడా స్క్రీన్ టైమ్ ఇచ్చేది మా హీరోనే అంటూ పోస్టులు పెడుతున్నారు .విజయ్- కమల్ హాసన్ లు కోస్టార్స్ విషయంలో ఈ రకంగా ఉండలేరని వ్యాఖ్యానించారు. వారిద్దరు అభద్రతా భావాన్ని కలిగి ఉంటారని వాళ్లనే హైలైట్ చేసుకుంటారని పోస్టులు పెట్టారు.
దీంతో విజయ్-కమ ల్ హాసన్ అభిమానులు ఫీలయ్యారు. ఈ వ్యాఖ్యలతో వీళ్లను రెచ్చగొట్టినట్లు అయింది. `విక్రమ్` సినిమాలో కమల్ హాసన్ ఫహాద్ పాజిల్ పాత్ర, `థగ్ లైఫ్` సినిమాలో శింబు పాత్రకు కు ఎంతో స్పేస్ ఇచ్చారని గుర్తు చేసారు. అలాగే `మాస్టర్` సినిమాలో విజయ్ కూడా విజయ్ సేతుపతి రోల్స్ కు అంతే ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తు చేసారు. సోషల్ మీడియాలో అభిమానుల మధ్య అప్పుడప్పుడు ఇలాంటి వివాదాలు సహజం. అవి అక్కడికే పరిమితం.
