Begin typing your search above and press return to search.

వెండి తెరపై AI... మరీ ఇంత త్వరగానా?

ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డ్‌ గ్రహీత రాజేష్ మపుస్కర్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న AI సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

By:  Ramesh Palla   |   8 Jan 2026 4:00 PM IST
వెండి తెరపై AI... మరీ ఇంత త్వరగానా?
X

ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా AI అనేది వినిపిస్తూ, కనిపిస్తున్న విషయం తెల్సిందే. సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే చాలు AI లో క్రియేట్‌ చేసిన అద్భుతాలు చాలానే కనిపిస్తున్నాయి. బాబోయ్ మరీ ఇంత నేచురల్‌గా ఒక పాత్రను క్రియేట్‌ చేయవచ్చా అని అంతా షాక్ అయ్యే విధంగా ఔత్సాహికులు AI ఆర్ట్‌ ను సోషల్‌ మీడియాలో కనబర్చుతూ ఉన్నారు. అయితే పూర్తిగా AI తో రూపొందించే సినిమాలు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అంతా భావించారు. కానీ అతి త్వరలోనే AI సినిమా రాబోతుంది. పూర్తి AI టెక్నాలజీతో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డ్‌ గ్రహీత రాజేష్ మపుస్కర్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న AI సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. మరీ ఇంత త్వరగా AI సినిమానా అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి AI టెక్నాలజీతో సినిమా

ఇప్పటికే పూర్తి AI టెక్నాలజీతో ఒక వెబ్‌ సిరీస్‌ను జియో హాట్‌ స్టార్‌ స్ట్రీమింగ్‌ చేస్తున్న విషయం తెల్సిందే. మహాభారత్‌ అనే ఈ వెబ్‌ సిరీస్‌ పూర్తి స్థాయి క్వాలిటీ లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. క్వాలిటీ లెస్‌గా ఉందని, లో బడ్జెట్‌ సినిమా అన్నట్లుగా ఉంది అంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత్రలకు సంబంధించిన హావభావాల విషయంలో విమర్శలు వినిపిస్తున్నాయి. వాటన్నింటిని పరిశీలించుకుంటూ, వారం వారం బెటర్‌గా ఇచ్చేందుకు జియో హాట్‌ స్టార్‌ వారు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో పూర్తి AI సినిమాను తీసుకు రావడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు అని, థియేటర్‌లో రిలీజ్‌ చేయడం కోసం AI సినిమాను రూపొందించాలంటే ఇంకాస్త అడ్వాన్స్ టెక్నాలజీ అవసరం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. కానీ ఇదే టెక్నాలజీతో మంచి ఔట్ పుట్‌ ను తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నట్లు దర్శకుడు రాజేష్‌ మపుస్కర్‌ చెబుతున్నాడు.

రాజేష్‌ మపుస్కర్‌ దర్శకత్వంలో...

ఇండస్ట్రీలో AI పెరిగితే కార్మికులు రోడ్డున పడుతారు అని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో మరో ఐదేళ్ల తర్వాత AI వస్తుందని భావిస్తూ ఉంటే, ఇంత త్వరగా రావడం షాకింగ్‌గా ఉందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై దర్శకుడు రాజేష్‌ మపుస్కర్‌ మాట్లాడుతూ... మనుషులు చేసే పనిని ఎప్పటికీ AI పూర్తిగా చేయడం సాధ్యం కాదు. AI తో సినిమాలను రూపొందించినా కూడా మనుషులు పూర్తిగా లేకుండా సాధ్యం కాదని, కచ్చితంగా మనుషులు ప్రతి రంగంలోనూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే అది కాస్త మ్యాన్‌ పవర్‌ ను తగ్గిస్తుందని, అలాగే మంచి క్వాలిటీ ఔట్‌ పుట్‌ ను అందిస్తుందనే అభిప్రాయంను వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పూర్తి స్థాయి వివరాలు మీడియాకు వెల్లడించేందుకు దర్శకుడు రెడీ అవుతున్నాడు.

చిరంజీవి హనుమాన్‌ : ది ఎటర్నల్‌ మూవీ

సినిమా చరిత్రలో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలువబోతున్నట్లు దర్శకుడు రాజేష్‌ మపుస్కర్‌ చెప్పుకొచ్చాడు. ఈ పూర్తి AI సినిమాకు 'చిరంజీవి హనుమాన్‌ : ది ఎటర్నల్‌' అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. ఈ సినిమాను ఇదే ఏడాది హనుమాన్‌ జయంతి రోజు విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమాను ఒక రకంగా చూసిన ప్రేక్షకులు భవిష్యత్తులో పూర్తి విభిన్నమైన సినిమాలను చూడబోతున్నారు. ఈ చిరంజీవి హనుమాన్ సినిమా కు మంచి స్పందన వస్తే వచ్చే ఏడాది నుంచే భారీ ఎత్తున AI సినిమాలు రూపొందడం జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా తక్కువ సమయంలో ఇంత స్పీడ్‌గా AI సినిమాలు వస్తాయని ఊహించలేదని ఇండస్ట్రీకి చెందిన వారు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2030 సంవత్సరం వరకు AI పూర్తి సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మార్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.