Begin typing your search above and press return to search.

అది మీ కర్మ.. తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను: రాజేంద్రప్రసాద్!

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కొద్ది రోజులుగా తన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Jun 2025 10:00 AM
అది మీ కర్మ.. తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను: రాజేంద్రప్రసాద్!
X

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కొద్ది రోజులుగా తన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రెస్ మీట్స్, సినిమా ఈవెంట్స్ లో ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకలా అలా స్టేజ్ పై మాట్లాడుతున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. ఒక సీనియర్ నటుడు అయ్యి ఉండి హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇప్పుడు ఆ విషయంపై తన లేటెస్ట్ మూవీ షష్టిపూర్తి సక్సెస్ మీట్ లో రాజేంద్ర ప్రసాద్ స్పందించారు.

"ఈ మధ్య కొన్ని ఫంక్షన్లలో సరదాగా మాట్లాడుతున్నా కూడా అది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది మీ కర్మ. మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకుంటే మీ సంస్కారం. నేను అయితే ఇలాగే ఉంటాను. సరదాగా ఉంటాను. కానీ వేరే లాగా అర్థం చేసుకుంటున్నారు" అని తెలిపారు.

"ఇండస్ట్రీలో నటీనటులంతా నాతో సరదాగా ఉంటారు. వారికి నేనెప్పుడూ అన్ని విషయాలు చెబుతుంటాను. ఈ మ‌ధ్య నేను ప‌రిచ‌యం చేసిన హీరోయిన్ అని.. యాక్ట‌ర్ గురించి మాట్లాడితే అంతా త‌ప్పుగా అనుకున్నారు. నేను ఇలాగే ఉంటాను. ఎందుకంటే వారికి అన్నయ్య‌ని కాబ‌ట్టి" అని రాజేంద్ర ప్ర‌సాద్ ఇప్పుడు చెప్పుకొచ్చారు.

కాగా, ఇటీవల జ‌రిగిన‌ ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకకు ఆయన వచ్చారు. స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతుండగా.. అప్పుడే సినీ నటి, మాజీ మంత్రి రోజా అక్కడికి వచ్చారు. దీంతో ఆమెను చూసిన రాజేంద్ర ప్రసాద్ విష్ చేశారు. అంతటితో ఆగకుండా.. ఏమే నిన్ను కూడా నేనే హీరోయిన్‌ ను చేశాను కదా అని అన్నారు. అప్పుడు రోజా విని నవ్వుకున్నారు.

ఆ తర్వాత సీనియర్ నటి ఆమనిని.. నిన్ను కూడా నేనే హీరోయిన్‌ ను చేశానని అన్నారు. కమెడియన్ అలీని ఉద్దేశించి బూతు మాట ఆడారు. కాదంబర్ కిరణ్‌ ను కాకి( కాదంబర్ కిరణ్‌) అంటూ పిలిచారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన వారంతా షాక్ అయినట్లు కనిపించారు. అంతకు ముందు రాబిన్ హుడ్ మూవీ ఈవెంట్ లో వార్నర్ పై కామెంట్ చేసి, ఆ తర్వాత సారీ చెప్పారు. మొత్తానికి వరుసగా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు.