షష్టిపూర్తి.. ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా!
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.. కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా షష్టిపూర్తి. లేడీస్ టైలర్ మూవీ వచ్చిన అనేక ఏళ్ల తర్వాత ఆయన నటి అర్చనతో ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
By: Tupaki Desk | 2 Jun 2025 1:48 AM ISTటాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.. కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా షష్టిపూర్తి. లేడీస్ టైలర్ మూవీ వచ్చిన అనేక ఏళ్ల తర్వాత ఆయన నటి అర్చనతో ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రూపేష్ చౌదరి హీరోగా నటించగా.. ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా యాక్ట్ చేశారు. అయితే నిర్మాత కూడా మూవీ హీరోనే. రూపేషే నిర్మించారు.
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. పవన్ ప్రభ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది. మంచి అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ కు ముందు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. మేకర్స్ బాగానే మూవీని ప్రమోట్ చేశారు.
ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుని సందడి చేస్తోంది షష్టిపూర్తి మూవీ. వారిని థియేటర్స్ కు రప్పిస్తోంది. మంచి టాక్ తో అలరిస్తోంది. కుటుంబ ప్రేక్షకులు తప్పకుండా చూడాలనేలా మూవీ ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అశ్లీలతకు, అసభ్యతకు తావు లేని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కొనియాడుతున్నారు. రివ్యూస్ కూడా ఇస్తున్నారు.
అయితే అనవసరపు కమర్షియల్ హంగుల జోలికి పోకుండా డైరెక్టర్ మంచిగా సినిమా తీశారని చెబుతున్నారు. తాను చెప్పాలనుకున్న కథను నీట్ గా.. నిజాయితీగా స్క్రీన్ పై ఆవిష్కరించారని అంటున్నారు. షష్టిపూర్తి మూవీ ఒక మంచి ఆలోచన నుంచి పుట్టిందని అంటున్నారు. సినిమా అంతా నిజ జీవితానికి బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు.
అదే సమయంలో దూరంగా ఉన్న తల్లిదండ్రులను కలపాలని ఒక కొడుకు చేస్తున్న భావోద్వేగాలపై డైరెక్టర్ ఫుల్ గా ఫోకస్ చేశారని అంటున్నారు. దాదాపు సీన్స్ అన్నీ ఎమోషనల్ గా రాసుకున్నారని చెబుతున్నారు. కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పట్ల గౌరవం, సంప్రదాయాలకు పెద్ద పీట వేసి కథ రాసుకున్నారని అంటున్నారు.
కాగా.. తల్లిదండ్రుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి ఒక కుమారుడి చిన్న పోరాటమే షష్టిపూర్తి సినిమా! మూవీ మొత్తాన్ని పూర్తిగా కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఉమ్మడి కుటుంబ నేపథ్యం నుంచి స్ఫూర్తి పొంది తీసినట్లు అర్థమవుతుంది. సన్నివేశాలు ఎంతో నేచురల్ గా ఉన్న ఆ సినిమా మీరు చూశారా?
