ఇప్పుడా లోటు కూడా తీరింది
రాజేంద్ర ప్రసాద్.. ఆయన తన కెరీర్లో ఎన్నో మంచి మంచి సినిమాలు చేశారు. మంచి సినిమాలు చేయడమే కాదు, ఆయన చేసిన ఎన్నో సినిమాలు, అందులోని పాటలు ఆడియన్స్ మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
By: Tupaki Desk | 26 May 2025 7:23 AMరాజేంద్ర ప్రసాద్.. ఆయన తన కెరీర్లో ఎన్నో మంచి మంచి సినిమాలు చేశారు. మంచి సినిమాలు చేయడమే కాదు, ఆయన చేసిన ఎన్నో సినిమాలు, అందులోని పాటలు ఆడియన్స్ మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇంకా చెప్పాలంటే ఆయన చేసిన సినిమాల్లోని పాత్రలు నిజజీవితంలో ప్రతీ ఒక్కరికీ ఏదొక సందర్భంలో ఎదురువుతూనే ఉంటాయి.
ఈ విషయాన్ని రీసెంట్ గా షష్టిపూర్తి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ స్వయంగా వెల్లడించారు. ఇండస్ట్రీలో ఎవరికీ రాని అదృష్టం తనకొచ్చిందని అన్నారు. నిజజీవితంలో తన వయసు అరవై ఏళ్లు దాటాయని, ఈ ఏజ్ లో ఎక్కడొచ్చి తన పిల్లలు షష్టిపూర్తి అంటారేమో అని తప్పించుకుంటూ తిరిగానని, కానీ ఈ సినిమాలో అది తప్పలేదని, సినిమాలో షష్టిపూర్తి తనదేనని చెప్పారు.
తన కెరీర్లో చేసిన సినిమాల్లో అన్ని రకాల పాటలున్నాయని, అన్ని పెళ్లిళ్లలో తన పెళ్లి పుస్తకం సినిమాలోని పాటే వినిపిస్తుందని, ఆ నలుగురు రిలీజైనప్పటి నుంచి చావు సమయంలో కూడా తన పాట వినిపించడం మొదలైందని, షష్టిపూర్తి టైమ్ లో నా పాట లేదని చాలా మంది అనేవాళ్లని, కానీ ఇప్పుడు ఆ లోటు కూడా తీరిందని, తన కెరీర్లో షష్టిపూర్తి సాంగ్ కూడా వచ్చిందని, ఇలాంటి స్పెషల్ సాంగ్ ను ఇళయరాజా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు రాజేంద్రప్రసాద్ చెప్పారు.
ఇక షష్టిపూర్తి సినిమా విషయానికొస్తే రాజేంద్ర ప్రసాద్, అర్చన కీలక పాత్రల్లో రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా షష్టిపూర్తి. మే 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా విజయవాడలో ట్రైలర్ ను రిలీజ్ చేసింది. మనసును కాకుండా మనిషి అలవాటల్ను ప్రేమించే నువ్వు మార్పు గురించి మాట్లాడకు అని రాజేంద్రప్రసాద్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ట్రైలర్ లోని ఎమోషన్ ను బాగా హైలైట్ అయ్యేలా చేసింది.