జరిగిన దానికి చాలా హర్ట్ అయ్యా
టాలీవుడ్ లో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య పలు కారణాలతో విమర్శల పాలవుతున్నారు.
By: Tupaki Desk | 5 Jun 2025 8:30 AMటాలీవుడ్ లో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య పలు కారణాలతో విమర్శల పాలవుతున్నారు. ఎంత టాలెంట్ ఉన్నా సంస్కారం కూడా ఉండాలని జనాలు ఆయనపై ఫైర్ అవుతున్నారు. మొన్నా మధ్య ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై అసభ్యకరమైన కామెంట్స్ చేసి రాజేంద్ర ప్రసాద్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత దానిపై క్లారిటీ ఇవ్వడంతో ఓకే అనుకున్నారు. కానీ మళ్లీ రీసెంట్ గా ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ లో అలీని, ఓ నటిని ఉద్దేశించి నోరు జారారు రాజేంద్ర ప్రసాద్. ఈ క్రమంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, ఆయన్న ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని స్వయంగా అలీ చెప్పినప్పటికీ ఈ ట్రోల్స్ ఆగడం లేదు.
ఊరికే నోరు జారడం, ఆ తర్వాత క్షమాపణ చెప్పడం రాజేంద్ర ప్రసాద్ కు కామనైందని, ఇంత ఇష్యూ అవుతున్న టైమ్ లో ఆయన పశ్చాత్తాప పడకుండా, తాను మాట్లాడే మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అది వాళ్ల ఖర్మ, సంస్కారంపై డిపెండ్ అయి ఉంటుందని చెప్పడమేంటని ఆయనపై కోప్పడుతున్నారు. అలీ వివరణ ఇచ్చినా ఈ విషయం సమసిపోకపోవడంతో ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తన మాట తీరుని అలీ సీరియస్ గా తీసుకున్నారని, ఈ విషయాన్ని పెద్దది చేయొద్దని అన్నారు. ఎవరో కావాలని దీన్ని పెద్దది చేస్తున్నారని, మేమంతా ఒకరికొకరం ప్రేమతో ఉంటామని అలాంటి బాండింగ్ లేకపోతే ఇంత కాలం కలిసి ప్రయాణించే వాళ్లం కాదని, ఏదేమైనా జరిగిన దానికి తాను చాలా హర్ట్ అయ్యానని, ఇకపై లైఫ్ లో ఎవరినైనా మీరు అనే పిలుస్తానని, ఎప్పుడూ నువ్వు అనే పదం వాడనని, ఈ విషయం తాను ఎన్టీఆర్ గారి దగ్గర నేర్చుకున్నానని, ఈ క్షణం నుంచి చివరి శ్వాస వరకు అందరినీ గౌరవంగానే పిలుస్తానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కూతురిని పోగొట్టుకున్న సందర్భంగా మైండ్ అప్‌సెట్ అయిందా అనే ప్రశ్నకు కూడా ఆయన స్పందించారు. కూతురిని పోగొట్టుకున్నప్పుడు చాలా అప్‌సెట్ అయ్యానని, కానీ దాన్నుంచి బయటకు వచ్చానని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.