Begin typing your search above and press return to search.

తార‌క్ ఫోన్ చేసినా సెట్స్ కి వెళ్ల‌ని రాజీవ్ క‌న‌కాల‌!

తాజాగా ఈ ప్ర‌చారం పై ఓ ఇంట‌ర్వ్యూలో రాజీవ్ క‌న‌కాల స్పందించారు. తార‌క్ తో స్నేహం అలాగే ఉంది.

By:  Tupaki Desk   |   26 July 2023 7:31 PM GMT
తార‌క్ ఫోన్ చేసినా సెట్స్ కి  వెళ్ల‌ని రాజీవ్ క‌న‌కాల‌!
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్-రాజీవ్ క‌న‌కాల స్నేహం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు మంచి స్నేహితులు. తార‌క్ ఇండ‌స్ట్రీకి రాక ముందు నుంచే రాజీవ్ కి మంచి స్నేహితుడ‌య్యాడు. టీడీపీ ప్ర‌చార స‌మ‌యం లో ఎన్టీఆర్ ప‌క్క‌నే నిరంత‌రం రాజీవ్ క‌న‌కాల కూడా ఉండ‌టంతో వాళ్ల స్నేహం గురించి ప్రేక్ష‌కులంద‌రికీ అర్ద‌మైంది. అలాగే ఎన్టీఆర్ న‌టించే సినిమాల్లోనూ రాజీవ్ క‌న‌కాల ఏదో పాత్ర‌లో క‌నిపిస్తుంటారు.

అయితే వీళ్లిద్ద‌రు క‌లిసి తెర‌ పై క‌నిపించి చాలా కాల‌మ‌వుతోంది. 'ఆర్ ఆర్ ఆర్' లాంటి సినిమా లో తార‌క్ పాత్ర‌కి వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డంతో రాజీవ్ క‌న‌కాల పాత్ర ముగిసింది. ఆ సినిమా షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ అవ్వ‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గానే ప‌ట్టింది. ఆ సినిమా చేస్తున్నంత సేపు తార‌క్ మ‌రో సినిమా లో న‌టించ‌లేదు. ఈ గ్యాప్ లో రాజీవ్ క‌న‌కాల త‌న‌కొచ్చిన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్లాడు.

అయితే ఈ గ్యాప్ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం చెడింద‌ని..ఇద్ద‌రు పెద్ద‌గా మాట్లాడుకోవ‌డం లేద‌ని నెట్టింట‌ ప్ర‌చారం సాగింది. తాజాగా ఈ ప్ర‌చారం పై ఓ ఇంట‌ర్వ్యూలో రాజీవ్ క‌న‌కాల స్పందించారు. తార‌క్ తో స్నేహం అలాగే ఉంది. ఆయ‌న‌కి ఇప్పుడు క‌మిట్ మెంట్లు..బాధ్య‌త‌లు పెరిగాయి. ఇప్పుడంత ఖాళీగా ఉండ‌టం లేదు. అందువ‌ల్ల ఈ మ‌ధ్య తార‌క్ ని క‌ల‌వ‌లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఆయ‌న పాత్ర‌ని ప‌రిచ‌యం చేసింది నేనే.

ఈ మ‌ధ్య‌నే సెట్స్ కి ర‌మ్మ‌ని కాల్ చేసాడు. కానీ నేను వెళ్ల‌లేదు. నా బిజీలో నేను ఉండ‌టం వ‌ల్ల అవ్వ‌లేదు. అంత‌కు మించి ఏం లేదు. తార‌క్ త‌ర్వాత త‌రుణ్..మ‌నోజ్..శివ బాలాజీతో బాగా చ‌నువుగా ఉంటా ను. త‌రుణ్ కి ఇప్ప‌టికీ మంచి క్రేజ్ ఉంది. తాను తలుచుకుంటే రీ ఎంట్రీ ఇవ్వొచ్చు. అలాగే నా కెరీర్ విష‌యంలో సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ట్రెండ్ మార‌డంతో కొత్త ర‌కం పాత్ర‌లు వ‌స్తున్నాయి' అని అన్నారు.