Begin typing your search above and press return to search.

రాజశేఖర్ విలన్ ఆశలు!

ఒకప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ అనంతరం మెల్లగా ఫామ్ కోల్పోయాడు

By:  Tupaki Desk   |   16 Nov 2023 6:40 AM GMT
రాజశేఖర్ విలన్ ఆశలు!
X

ఒకప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ అనంతరం మెల్లగా ఫామ్ కోల్పోయాడు. ఇప్పుడు ఆడియెన్స్ టేస్ట్ కు తగ్గట్టుగా సరైన కథలను సెలెక్ట్ చేసుకోలేక పోతున్నారు. సొంత బ్యానర్ లో కూడా సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏది పెద్దగా వర్కౌట్ కావడం లేదు.

ఇక ఆయన సినిమాల్లో హీరో స్థాయి నుంచి పక్కకు జరిగి కీలకమైన పాత్రలలో కనిపిస్తే బెటర్ అనే కామెంట్స్ ఎక్కువగానే వచ్చాయి. రాజశేఖర్ కూడా ఎంతో కాలంగా సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల్లో ఉపేంద్ర చేసినటువంటి రోల్స్ చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఆ రూట్లో కూడా రాజశేఖర్ కు సరైన అవకాశాలు రావడం లేదు.

ఇక ఇప్పుడు రాజశేఖర్ విలన్ రోల్స్ చేసేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన కూతురు శివాత్మిక ఒక ఇంటర్వ్యూలో తండ్రి గురించి మాట్లాడుతూ.. నితిన్ హీరోగా చేస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ లో నాన్న గారి స్పెషల్ క్యామియో కిక్కాస్ గా ఉండబోతుంది అంటూ ఆయన కేరెక్టర్స్ కి కూడా ఓపెన్ గా ఉన్నారని చెప్పింది. అంతే కాకుండా నచ్చిన పాత్రలు వస్తే విలన్ గా కూడా చేయడానికి రెడీ గా ఉన్నారు అని శివాని తెలియజేసింది.

దీన్ని బట్టి రాజశేఖర్ బలమైన విలన్ పాత్రలు వస్తే చేయడానికి ప్రిపేర్ గా ఉన్నారని చెప్పవచ్చు. సీనియర్ హీరోలు నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలు చేయడం కొత్తేమి కాదు. ఇప్పుడు జగపతిబాబు అదే రూట్లో వెళుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు హీరోగా కంటే విలన్ పాత్రలతోనే జగపతిబాబు మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు.

ఇక ఇప్పుడు రాజశేఖర్ కాస్త ఆలోచించి విలన్ పాత్రలు సెలెక్ట్ చేసుకుంటే సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక రాజశేఖర్ సినిమాల్లో తన పాత్ర ఎంత బలంగా ఉందొ జాగ్రత్తగా ఆలోచించి కథలను సెలెక్ట్ చేసుకుంటే బెటర్. మరి రాబోయే రోజుల్లో రాజశేఖర్ జగపతిబాబు తరహాలో అవకాశాలు అందుకుంటాడో లేదో చూడాలి.