Begin typing your search above and press return to search.

రాజా సాబ్ ఆ విషయంలో డౌట్లు అక్కర్లేదా..?

ప్రభాస్ పాత్రనే హైలెట్ గా చేస్తూ తన మార్క్ కామెడీ పండించేలా చేస్తున్నాడట మారుతి. ప్రభాస్ మారుతి ఈ కాంబో ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 9:30 AM GMT
రాజా సాబ్ ఆ విషయంలో డౌట్లు అక్కర్లేదా..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజా సాబ్ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా మొదలైనప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏంటి మారుతి డైరెక్షన్ లో సినిమా ఏంటని రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు. కానీ ఆ కామెంట్స్ ఏవి పట్టించుకోకుండా మారుతి తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన రాజా సాబ్ ఫస్ట్ లుక్ అంచనాలు పెంచేసింది. ప్రభాస్ ని లుంగీ లుక్ తో కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు మారుతి.

రాజా సాబ్ లుక్ తో ఈ సినిమా పక్కా ఎంటర్టైన్మెంట్ అని చెప్పకనే చెప్పాడు మారుతి. తన ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ నే ప్రధాన అంశంగా చేసుకుంటూ వచ్చిన మారుతి ప్రభాస్ రాజా సాబ్ తో కూడా అదే ఎంటర్టైన్మెంట్ నే అస్త్రంగా చేసుకుంటున్నాడని తెలుస్తుంది. రాజా సాబ్ లో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కూడా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.

ప్రభాస్ పాత్రనే హైలెట్ గా చేస్తూ తన మార్క్ కామెడీ పండించేలా చేస్తున్నాడట మారుతి. ప్రభాస్ మారుతి ఈ కాంబో ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ తో మలయాళ భామ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

రెబల్ స్టార్ ప్రభాస్ ఈమధ్య అన్నీ సీరియస్ రోల్స్ వేస్తున్న కారణంగా ఫ్యాన్స్ తమ హీరో నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఆశిస్తున్నారు. ఆ లోటు తీర్చేలా ఫ్యాన్స్ ని సూపర్ గా ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. థ్రిల్లర్ అంశాలతో పాటుగా ప్రభాస్ నుంచి ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ గా మారుతి ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా మొదైనప్పుడు ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నా ఇప్పుడు మాత్రం సినిమాపై భారీ హైప్ తెచ్చుకుంది.

ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఈ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. రాజా సాబ్ మాత్రం ఈ ఇయర్ డిసెంబర్ రిలీజ్ అనుకోగా వచ్చే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక వీటితో పాటుగా ప్రభాస్ సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ రాబోతుంది. ఈ సినిమా కూడా ఈ ఇయర్ సెట్స్ మీదకు వెళ్లబోతుంది. 2025 సమ్మర్ కి ఆ సినిమా రిలీజ్ ఉండొచ్చని టాక్.