Begin typing your search above and press return to search.

రాజా సాబ్.. పెద్ద చిక్కే వచ్చి పడింది!

హీరో ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 May 2024 6:30 AM GMT
రాజా సాబ్.. పెద్ద చిక్కే వచ్చి పడింది!
X

హీరో ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ఇప్పుడు వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా గడుపుతున్నారు. మొన్నటి వరకు కల్కి మూవీతో క్షణం తీరిక లేకుండా గడిపారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూన్ 27వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ రోల్ లో కనిపించనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

అయితే కల్కి మూవీ కంప్లీట్ అయిన తర్వాత.. ప్రభాస్ స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టారు. కొన్ని నెలల క్రితం ఈ మూవీ షూటింగ్ ను సైలెంట్ గా స్టార్ట్ చేసిన మారుతి.. ఆ తర్వాత అఫీషియల్ గా ప్రకటించారు. కానీ ప్రభాస్ భారీ లైనప్ వల్ల ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ పార్ట్ తక్కువ భాగం మాత్రమే పూర్తయింది.

ఇక యూరప్ వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత ప్రభాస్.. ఏప్రిల్, మే నెలల్లో బల్క్ డేట్స్ ను కేటాయిస్తానని డైరెక్టర్ మారుతికి హామీ ఇచ్చినట్లు టాక్ వినిపించింది. చెప్పినట్టు ఏప్రిల్ లో వారం రోజుల పాటు జరిగిన షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ సాంగ్ ను కూడా షూట్ చేసినట్లు తెలిసింది. మేలో చాలా వరకు షూటింగ్ ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు ప్రభాస్. ఇక ఇప్పుడే అసలు ట్విస్ట్ మొదలైంది.

గత ఏడాది ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అప్పుడే ప్రకటించారు. శౌర్యాంగ పర్వం టైటిల్ తో తెరకెక్కిస్తామని తెలిపారు. ఇప్పుడు ఈ మూవీ స్క్రిప్ట్ సిద్ధమైందని, షూటింగ్ కు అంతా రెడీ అయినట్లు తెలుస్తోంది. మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల సలార్ -2 కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించాల్సి ఉంది.

దీంతో రాజా సాబ్ ఇంకా లేట్ అవుద్దని వార్తలు వస్తున్నాయి. సాధారణంగా మారుతి తన సినిమాలను స్పీడ్ గా కంప్లీట్ చేస్తారు. కానీ ఈ మూవీని మాత్రం ప్రభాస్ బిజీగా ఉండటం వల్ల సగం కూడా పూర్తి చేయలేకపోయారు. ఎప్పటి నుంచో వెయిటింగ్ మోడ్ లో ఉన్నారు. ఈ సినిమాను మారుతి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనే యోచనలో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

కానీ ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే.. రాజా సాబ్ వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సలార్-2ను త్వరగా పూర్తి చేసి డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అదే కనుక నిజమే వచ్చే ఏడాది వేసవికి రాజా సాబ్ పోస్ట్ పోన్ అవ్వనుందని సమాచారం. చూడాలి మరేం జరుగుతుందో.