Begin typing your search above and press return to search.

రాజా సాబ్.. ఎంతవరకు వచ్చిందంటే..

గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా మొదటి పార్ట్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   24 Jan 2024 3:45 AM GMT
రాజా సాబ్.. ఎంతవరకు వచ్చిందంటే..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కీ సినిమాతోపాటు రాజా సాబ్ అనే మరో సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సీక్వెల్ ను కూడా త్వరలోనే మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును చాలా వేగంగా పూర్తి చేయాలని ఆలోచనతో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా మొదటి పార్ట్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అందుకే ఆలస్యం చేయకుండా సీక్వెల్ కూడా ఇదే వేడిలో మొదలుపెట్టి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక మరొకవైపు ప్రభాస్ కల్కీ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంటుంది. అయితే ఈ ప్రాజెక్టు ను అనుకున్న ప్లాన్ ప్రకారం ఇదే ఏడాది మే నెలలో విడుదల చేయాలి. కానీ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమాను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

మరోవైపు లిస్టులో మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నాడు. హారర్ ప్లస్ కామెడీ ట్రెండ్ లో రాబోతున్న ఈ సినిమాకు కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ప్లాన్ ప్రకారం అయితే ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లోపు ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది.

ఇక ఎక్కువగా అయితే లోకల్ లో నిర్మించిన భారీ సెట్లలోనే ఈ సినిమాను షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మారుతి అనుకుంటే మాత్రం అనుకున్న సమయానికంటే ఈ సినిమా షూటింగ్ ముందుగానే అయిపోవచ్చు. ఇక రిలీజ్ టార్గెట్ టెన్షన్ లేకుండానే రాజా సాబ్ టీం షూటింగ్లో పనుల్లో బిజీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను అయితే ఇదే ఏడాది డిసెంబర్లో విడుదల చేసే ఆలోచనలకు కూడా ఉన్నారు.

అన్ని అనుకున్నట్టు జరిగితే రాజా సాబ్ సినిమా సలార్ మాదిరిగానే సెంటిమెంట్ గా డిసెంబర్ లో భారీ స్థాయిలో విడుదల కావచ్చు. ఎందుకంటే అప్పుడు పోటీగా బాలీవుడ్ నుంచి కూడా పెద్దగా సినిమాలు ఏమీ రావడం లేదు. కేవలం అక్షయ్ కుమార్ వెల్కమ్ 3 మాత్రమే విడుదల కానుంది. అయితే సౌత్ ఇండియాలో మాత్రం ఆ సినిమాతో ఎలాంటి పోటీ ఉండదు. ఇది మారుతి సినిమా కాబట్టి బాలీవుడ్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో సినిమా వచ్చే వరకు ఎవరు ఉహించలేరు. కానీ కామెడీ ప్లస్ హారర్ సినిమాలు క్లిక్ అయితే మాత్రం కలెక్షన్స్ హై రేంజ్ లో ఉంటాయని చెప్పవచ్చు. మరి ప్రభాస్ లక్కు ఎలా ఉంటుందో చూడాలి.