Begin typing your search above and press return to search.

ప్రభాస్.. ఆ సినిమాకు అంత టైమా?

డార్లింగ్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ రాజాసాబ్. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

By:  Tupaki Desk   |   30 Jan 2024 4:41 AM GMT
ప్రభాస్.. ఆ సినిమాకు అంత టైమా?
X

డార్లింగ్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ రాజాసాబ్. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. హర్రర్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో మూవీని మారుతి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

కట్టప్ప సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారంట. ఈ మూవీ షూటింగ్ గత ఏడాది అక్టోబర్ లో స్టార్ట్ చేశారు. సలార్. కల్కి 2898 ఏడీ సినిమాలు సెట్స్ పై ఉండగానే రాజాసాబ్ షూటింగ్ కూడా మొదలుపెట్టేసాడు. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం జరగడం లేదు. కల్కి 2898 ఏడీ కంప్లీట్ చేసిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.

కల్కి మూవీ మేలో రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజాసాబ్ షూటింగ్ త్వరలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. షూటింగ్ మొత్తం ఒకే సెట్ లో ఉంటుంది కాబట్టి వీలైనంత వేగంగా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. అయితే సలార్ 2 మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండింటిని మ్యానేజ్ చేస్తూ షెడ్యూల్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.

తాజాగా ట్రూ లవర్ టీజర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో రాజాసాబ్ గురించి మారుతి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇప్పుడే కన్ఫర్మ్ చేసి చెప్పలేనని తేల్చేశాడు. అయితే అందరూ కోరుకునే డేట్ కి అయితే కచ్చితంగా వస్తుందని కూడా చెప్పాడు. దీనిని బట్టి ప్రభాస్ పుట్టినరోజు లేదంటే కృష్ణంరాజు జయంతి రోజున మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం తెరపైకి వచ్చింది.

ఏది ఏమైనా ఇతర బడ్జెట్ సినిమాల కంటే రాజాసాబ్ మూవీ ఇంకా ఎక్కువ సమయం షూటింగ్ అండ్ రిలీజ్ కోసం తీసుకుంటుందని అర్ధమవుతోంది. ప్రభాస్ ప్రాధాన్యతని బట్టి రాజాసాబ్ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది వేచి చూడాలి.