Begin typing your search above and press return to search.

రాజా సాబ్ టీజర్.. తాత దెయ్యంతో డార్లింగ్ హారర్ థ్రిల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ రాజా సాబ్. రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ గా రూపొందుతున్న ఆ సినిమాకు డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Jun 2025 11:48 AM IST
రాజా సాబ్ టీజర్.. తాత దెయ్యంతో డార్లింగ్ హారర్ థ్రిల్
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ రాజా సాబ్. రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ గా రూపొందుతున్న ఆ సినిమాకు డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన వీడియోలు, పోస్టర్‌ లు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. కానీ మూవీ అప్డేట్ గురించి కొంతకాలంగా సినీ ప్రియులు, అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దీంతో మేకర్స్ రీసెంట్ గా టీజర్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం రిలీజ్ చేస్తామని చెప్పారు. అంతకుముందు నిన్న.. ప్రీ టీజర్ ను రిలీజ్ చేసి భారీ అంచనాలు క్రియేట్ చేశారు. అందుకే అంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తుండగా.. వారంతా ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. టీజర్ రిలీజ్ అయింది.

ఓ పెద్ద కోట లాంటి బిల్డింగ్ ను స్టార్టింగ్ లో చూపించి మేకర్స్.. టీజర్ ను స్టార్ట్ చేశారు. చంద్రముఖి వైబ్స్ తెప్పించారు. ఈ ఇల్లు నా దేహం.. ఈ సంపద నా ప్రాణం.. నా తదనంతరం నేను మాత్రమే అనుభవిస్తానని బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించింది. అప్పుడే ప్రభాస్.. బండి కొంచెం మెల్లగా.. అసలే లైఫ్ అంతంత మాత్రం అంటూ ఎంట్రీ ఇచ్చారు.

ఆ తర్వాత విభిన్నమైన రోల్స్ లో కనిపించారు. ముగ్గురు హీరోయిన్స్ తో సందడి చేశారు. సంజయ్ దత్ క్యారెక్టర్ కొత్తగా ఉంది. టీజర్ లో కామెడీ, హారర్ ఎలిమెంట్స్ రెండూ సమానంగా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ అదరగొట్టారు. ఓ సీన్ లో ఏకంగా అగ్గితో చెలగాటం ఆడుతూ కనిపించారు మన డార్లింగ్.

ఆ తర్వాత దుర్గమ్మ తల్లి కాపాడమ్మా.. తాత వైర్ కొరికేశాడేమో చూడండ్రా బయట అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఫుల్ గా నవ్విస్తోంది. ప్రభాస్ ను మారుతి చూపించిన తీరుకు ఫిదా అవ్వాల్సిందే. అయితే టీజర్ లో ప్రభాస్ అదరగొట్టేశారు. అన్ని రోల్స్ కు సరిగ్గా సరిపోయారు. మారుతి మార్క్ క్లియర్ గా ఉంది.

విశ్వప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇప్పుడు టీజర్ అదిరిపోయిందని చెబుతున్నారు నెటిజన్లు, ఫ్యాన్స్. వింటేజ్ ప్రభాస్ బ్యాక్ అని.. ఆయనను ఎలా చూడాలని అనుకుంటున్నామో అలాగే చూపించారని అంటున్నారు. వెయిటింగ్ ఫర్ మూవీ అని చెబుతున్నారు.

ఓవరాల్ గా టీజర్.. ఇప్పుడు అందరినీ మెప్పిస్తూ దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆడియన్స్ లో సినిమాపై ఉన్న అంచనాలను పెంచేస్తోంది. కచ్చితంగా మూవీ హిట్ అవుతుందనే సూచనలు టీజర్ ద్వారా కనిపిస్తున్నాయి. మరి రాజా సాబ్ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.