Begin typing your search above and press return to search.

తలైవా.. మళ్ళీ స్పీడ్ పెంచుతున్నాడు

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 11:30 PM GMT
తలైవా.. మళ్ళీ స్పీడ్ పెంచుతున్నాడు
X

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా కోలీవుడ్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న మూవీగా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ జై భీమ్ ఫేమ్ కేఈ జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

దీని తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో లోకేష్ ఉన్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లడమే కాకుండా రిలీజ్ కూడా ఉంటుందని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి సర్వత్రా వెయిట్ చేస్తున్నారు.

ఈ చిత్రం తర్వాత యంగ్ టాలెంటెడ్ దర్శకుడు మరి సెల్వరాజ్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. దర్శకుడు చెప్పిన స్టోరీ రజినీకాంత్ కి బాగా నచ్చడం వెంటనే ఒకే చెప్పేశారంట. రీసెంట్ గా ఈ దర్శకుడు ఉదయనిధి స్థాలిన్, వడివేలు కాంబినేషన్ లో మామన్నన్ అనే సినిమా చేశాడు. ఈ మూవీ అగ్రవర్ణాలు, తక్కువ జాతి మధ్య జరిగే ఆధిపత్య పోరుగా చూపించారు.

ఈ సినిమా తమిళనాట సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సెల్వరాజ్ రజినీకాంత్ కి కథ చెప్పి ఒప్పించడంతో పెద్ద సినిమా చేసే ఛాన్స్ సొంతం చేసుకున్నట్లు అయ్యింది. ఈ మూవీ తర్వాత మరల నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మూవీ ఉఅవకాశాలు ఉన్నాయని సమాచారం

ఇలా గ్యాప్ లేకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రతి ఏడాది ఒకటి,రెండు సినిమాలు ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేస్తూ ఉండటం నిజంగా విశేషమని చెప్పాలి. అయితే త్వరలో రజినీకాంత్ సినిమాల నుంచి విరామం కూడా తీసుకుంటారనిప్రచారం