Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ వద్దన్నారు.. ఐనా తగ్గనేలేదు

తమిళ్‌ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ చాలా ఏళ్ల తర్వాత జైలర్‌ సినిమాతో కమర్షియల్‌ హిట్‌ ను దక్కించుకున్నాడు. అలాంటి ఇలాంటి హిట్‌ కాదు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 2:45 AM GMT
సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ వద్దన్నారు.. ఐనా తగ్గనేలేదు
X

తమిళ్‌ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ చాలా ఏళ్ల తర్వాత జైలర్‌ సినిమాతో కమర్షియల్‌ హిట్‌ ను దక్కించుకున్నాడు. అలాంటి ఇలాంటి హిట్‌ కాదు. తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్‌ చిత్రాల జాబితాలో జైలర్ నిలిచింది. రజినీకాంత్‌ పనైపోయింది అనుకున్న వారికి జైలర్‌ కలెక్షన్స్‌ ని అభిమానులు చూపించుకునేలా దర్శకుడు నెలన్స్‌ దిలీప్‌ చేశాడు.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న నెల్సన్‌ దిలీప్‌ తక్కువ సమయంలోనే ఏకంగా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తో సినిమా ను చేసే అవకాశం దక్కించుకున్నాడు. రజినీకాంత్ కి ఆయన వయసుకు తగ్గ పాత్ర తో కథ ను చెప్పాడట. రజినీకాంత్‌ కథ విన్న సమయంలోనే చాలా ఎగ్జైట్‌ అయ్యాడట.

రజినీకాంత్‌ పాత్ర కోసం ఎలా అయినా నటించేందుకు ఓకే చెప్పారట. కానీ రజినీకాంత్‌ అభిమానులు మాత్రం షూటింగ్ ఆరంభ సమయంలో కాస్త బెదిరింపులకు పాల్పడ్డారట. రజినీకాంత్ ను తెల్లటి జుట్టు తో చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు అన్నారట. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా రజినీ కాంత్‌ ను తెల్ల జుట్టుతో చూపిస్తే ఎవరు చూడరని బెదిరించారట.

ఫ్యాన్స్ తో పాటు చాలా మంది రజినీకాంత్‌ వయసు పెంచి చూపించినా పర్వాలేదు కానీ, ఆయన జుట్టు తెల్లగా మాత్రం చూపించవద్దని సున్నితంగా చెప్పిన వారు ఉన్నారు, హెచ్చరించి మరీ చెప్పిన వారు ఉన్నారంటూ దర్శకుడు నెల్సన్ దిలీప్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

తాను అనుకున్న కథను, అనుకున్న విధంగా చూపించేందుకు, ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు నేను సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ బెదిరించినా కూడా పట్టించుకోలేదు. ఫ్యాన్స్ బెదిరింపులకు తగ్గకుండా రజినీకాంత్‌ ను వైట్ హెయిర్‌ తో చూపించాను. కొన్ని రోజుల షూట్‌ తర్వాత సినిమా విడుదల తర్వాత ఫ్యాన్స్ కూడా అంగీకరిస్తానే నమ్మకం కుదిరిందని నెల్సన్ దిలీప్‌ అన్నారు.