Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు క‌య్యానికి కాలు దువ్వుతున్నారా?

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్-విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ మ‌ధ్య అప్ప‌ట్లో ఎలాంటి పోటీ ఉండేదో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రి సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద పోటా పోటీగా రిలీజ్ అయ్యేవి.

By:  Tupaki Desk   |   20 Jan 2024 5:30 PM GMT
ఆ ఇద్ద‌రు క‌య్యానికి కాలు దువ్వుతున్నారా?
X

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్-విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ మ‌ధ్య అప్ప‌ట్లో ఎలాంటి పోటీ ఉండేదో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రి సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద పోటా పోటీగా రిలీజ్ అయ్యేవి. వ‌సూళ్ల‌కై ఇద్ద‌రు నువ్వా? నేనా ? అన్న రేంజ్ లో త‌గ్గాప్ వార్ న‌డిచేది. అప్ప‌ట్లో ఆ ఇద్ద‌రి హీరోల‌ అభిమానుల మ‌ధ్య వైరం సైతం అలాగే ఉండేది. కాల క్ర‌మంలో ఆ ట్రెండ్ మారింది. పోటా పోటీగా రిలీజ్ చేయ‌డం కూడా త‌గ్గింది.

వాళ్ల‌కు పోటీగా కొత్త స్టార్లు తయార‌వ్వ‌డంతో పోటీ అనే స‌న్నివేశ‌మే ఇప్పుడు క‌నుమ‌రుగైపోయింది. అయితే తాజాగా కొన్ని ద‌శాబ్ధాల త‌ర్వాత మ‌ళ్లీ ర‌జ‌నీ-క‌మ‌ల్ ఒకేసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డ‌టానికి రెడీ అవుతు న్న‌ట్లు కోలీవుడ్ లో ప్ర‌చారం సాగుతోంది. క‌మ‌ల్ హాస‌న్ నటిస్తోన్న `ఇండియ‌న్-2` ని స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాపై పాన్ ఇండియాలో భారీ అంచ‌నాలే ఉన్నాయి. `భార‌తీయుడు` సీక్వెల్ కావ‌డంతోనే ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే స‌రిగ్గా ఈసినిమా రిలీజ్ తేదీకే సూప‌ర్ స్టార్ న‌టిస్తోన్న `వెట్టాయ‌న్` కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట‌. ఈ సినిమా ఇంకా చిత్రీక‌ర‌ణ స్టేజ్ లోనే ఉంది.

షూట్ సహా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ గ‌నుక అనుకున్న స‌మ‌యంలో పూర్త‌యిపోతే ఏప్రిల్ లో ఆ తేదీకే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారుట‌. ఇదే జ‌రిగితే ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ధ్య చాలా సంవత్స‌రాల త‌ర్వాత క్లాష్ అవుతున్న‌ట్లే. ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే స‌న్నివేశం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. థియేట‌ర్ల స‌ర్దుబాటు దగ్గ‌ర నుంచే యుద్దం మొద‌ల‌వుతుంది.