Begin typing your search above and press return to search.

హిందీ సిరీస్ లో తెలుగుదనం... ఎంత బాగుందో

బాలీవుడ్ లో ఉన్నప్పటికీ, ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ.. తెలుగును మర్చిపోలేదంటూ రాజ్ అండ్ డీకేను ప్రశంసిస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Aug 2023 2:49 PM GMT
హిందీ సిరీస్ లో తెలుగుదనం... ఎంత బాగుందో
X

జీవితంలో ఎక్కడ ఉన్నా, ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగినా.. ఎక్కడి నుంచి వచ్చామో మరవకూడదు అంటారు. అలాగే పుట్టిన గడ్డను మరవకూడదనే సామెత ఉంటుంది. దర్శక ద్వయం రాజ్(రాజ్‌ నిడిమోరు) అండ్ డీకే(కృష్ణ దాసరి కొత్తపల్లి) ఇదే బాటలో నడుస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

రాజ్‌ అండ్‌ డీకే.. ఈ పేరు ఓటీటీ మార్కెట్ లో ఓ బ్రాండ్‌. కంటెంటున్నోడికి అడ్డంకులుండవని నిరూపిస్తూ బాలీవుడ్ లో తెలుగోడి జెండాను నిలబెట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన వీరిద్దరు ఇండస్ట్రీ మీద మక్కువతో బాలీవుడ్ లో అడుగుపెట్టి సిరీస్ లు చేస్తూ విజయాల్ని అందుకుంటున్నారు. అయితే వీరు తీసే సిరీస్ ల్లో ఓ ప్రత్యేకత కూడా ఉంటుంది. చేసేది హిందీ సిరీస్ లు అయినా తెలుగును మాత్రం మరవరు.

తమ సిరీస్ ల్లో తెలుగు కంటెంట్ లేదా తెలుగు పాత్రలను సృష్టిస్తుంటారు. ఇప్పటికే వీరి నుంచి వచ్చిన ఫ్యామిలీ మ్యాన్‌, ఫర్జీ వంటి సిరీస్‌లు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వీరి నుంచి వచ్చిన మరో కొత్త సిరీస్ గన్స్‌ అండ్‌ గులాబ్స్‌. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ఈ సిరీస్ లోను తెలుగు కంటెంట్ ను జోడించారు.

ఈ సిరీస్ లోని ప్రధాన పాత్రల్లో 4కట్ ఆత్మారామ్(గుల్షన్ దేవయ్య) కూడా ఒకటి. ఓ సారి ఆత్మారామ్.. గులాబ్ గంజ్ లోని ఓ హోటల్ కు వెళ్తాడు. ఆ హోటల్ పేరు పెద్దమ్మ మెస్ అని ఉండటం విశేషం.

అక్కడ టాలీవుడ్ దిగ్గజ నటులు ఎన్టీఆర్, సావిత్రి, జమున సహా పలువురు స్టార్స్ ఫొటోలు ఉంటాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో కూడా చిరంజీవి సూపర్ హిట్ దినక్కుత్తా కసక్కురో సాంగ్ ను ప్లే చేస్తూ సన్నివేశాన్ని చూపించారు.

అలాగే ఈ సన్నివేశం చివర్లో హోటల్ యజమాని-ఆత్మరామ్ మధ్య జరిగే సంభాషలను కూడా తెలుగులో మైండ్ బ్లో అయ్యేలా పెట్టారు. హిందీ వెర్షన్ లో ఈ సిరీస్ చూసేవారు ఒక్కసారిగా తెలుగు సంభాషలు రావడం, తెలుగు వాతావరణాన్ని క్రియేట్ చేయడం చూసి మస్త్ ఆస్వాదిస్తున్నారు. ఇది ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

అంతకుముందు కూడా ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్ లోనూ ప్రియమణి పాత్ర తెలుగు మాట్లాడుతూ ఆకట్టుకుంది. దీంతో తెలుగు ఆడియెన్స్.. రాజ్ అండ్ డీకేను మెచ్చుకుంటున్నారు. బాలీవుడ్ లో ఉన్నప్పటికీ, ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ.. తెలుగును మర్చిపోలేదంటూ రాజ్ అండ్ డీకేను ప్రశంసిస్తున్నారు.

ఇకపోతే ఈ సిరీస్ విషయానికొస్తే.. రాజ్‌కుమార్‌ రావు, దుల్కర్‌ సల్మాన్‌, గుల్షన్‌ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. దీనికి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. అయినప్పటికీ ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ టాప్ 10 చార్ట్స్ లో చోటు దక్కించుకుని నెం.1గా దూసుకెళ్తోంది. మరో వారం పాటు ఈ సిరీస్ హవా ఇలానే కొనసాగుతుందనిపిస్తోంది.