Begin typing your search above and press return to search.

రాజమౌళి-వార్నర్.. అదిరిపోలా

రాజమౌళి.. ఇండియాలో నంబర్ వన్ దర్శకుడు. డేవిడ్ వార్నర్.. భారతీయులకు ఎంతో ఇష్టమైన ఫారిన్ క్రికెటర్

By:  Tupaki Desk   |   12 April 2024 11:18 AM GMT
రాజమౌళి-వార్నర్.. అదిరిపోలా
X

రాజమౌళి.. ఇండియాలో నంబర్ వన్ దర్శకుడు. డేవిడ్ వార్నర్.. భారతీయులకు ఎంతో ఇష్టమైన ఫారిన్ క్రికెటర్. వీళ్లిద్దరి కలయికలో ఒక యాడ్ రూపొందితే..? ఇప్పుడు అదే జరిగింది. క్రెడ్ కోసం వీళ్లిద్దరూ చేసిన కొత్త యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇండియన్ సినిమాల్లో ఫేమస్ పాటలకు.. సన్నివేశాలకు టిక్ టాక్ వీడియోలు చేసి మన ప్రేక్షకులను అలరించే డేవిడ్ వార్నర్.. ఇప్పుడు రాజమౌళితో కలిసి చేసిన ‘క్రెడ్’ యాడ్‌లో వేసిన వేషాలు అన్నీ ఇన్నీ కావు.

ముందుగా ఈ యాడ్‌లో రాజమౌళి వార్నర్‌కు కాల్ చేస్తాడు. డేవిడ్ సార్.. మ ్యాచ్ టికెట్ల కోసం డిస్కౌంట్ వస్తుందా అని అడుగుతాడు. దానికి బదులుగా క్రెడ్ యూపీఐ ఉంటే వస్తుందని అంటాడు. క్రెడ్ యూపీఐ లేకుంటే ఎలా అని అడుతాడు. దానికి వార్నర్ ఒక ఫేవర్ చేయమంటాడు.

ఆ ఫేవర్ ఏంటంటే.. వార్నర్‌తో కలిసి రాజమౌళి సినిమా చేయడం. ఈ క్రమంలో వార్నర్.. రాజమౌళి సినిమాల్లో నటిస్తే ఎలా ఉంటుందో చూపించారు. షూటింగ్‌లో అతను చేసే బీభత్సం.. అతడి నట విశ్వరూాపాన్ని చూస్తూ రాజమౌళి ఫ్రస్టేట్ అయ్యే సీన్లు చూపిస్తారు. ఈ క్రమంలో ఒక సీన్లో ఓవరాక్షన్ చేసి ఆస్కార్ అవార్డుల్లో కలుద్దాం అంటాడు.

ఈ అరాచకాలన్నీ చూశాక రాజమౌళి.. ఆ ఊహ నుంచి బయటికి వచ్చి ఈ ఆప్షన్ వద్దులే అనుకుని క్రెడ్ యూపీఐని అడాప్ట్ చేసుకుంటాడు. ఈ యాడ్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇదెక్కడి మాస్‌రా అయ్యా అంటూ రాజమౌళి, వార్నర్‌ల మీద ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. వార్నర్‌కు మన జనాల్లో ఉన్న మాస్ ఇమేజ్‌ను భలేగా వాడుకున్నారని.. రాజమౌళితో అతడి కాంబినేషన్ అదిరిందని కొనియాడుతున్నారు.