Begin typing your search above and press return to search.

రణబీర్ ని ఇబ్బంది పెట్టిన జక్కన్న

ఇక స్టేజ్ పైన రాజమౌళి మాట్లాడుతూ రణబీర్ కపూర్ కి ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. సందీప్ రెడ్డి వంగా బెస్ట్ డైరెక్టర్ అని అంటున్నావ్ కదా.

By:  Tupaki Desk   |   28 Nov 2023 3:58 AM GMT
రణబీర్ ని ఇబ్బంది పెట్టిన జక్కన్న
X

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం యానిమల్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 1న రిలీజ్ కాబోతోంది. దేశ వ్యాప్తంగా మూవీపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మూవీపై అంచనాలు అమాంతం పెంచేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది.

ఈ ఈవెంట్ కి సినీ ప్రముఖులు అందరూ హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు రాజమౌళి ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇక స్టేజ్ పైన రాజమౌళి మాట్లాడుతూ రణబీర్ కపూర్ కి ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. సందీప్ రెడ్డి వంగా బెస్ట్ డైరెక్టర్ అని అంటున్నావ్ కదా. నీకు ఇప్పటికిప్పుడు అవకాశం వస్తే సందీప్ రెడ్డి, నేను ఉంటే ఎవరితో చేస్తావ్ అని అడిగారు.

అయితే ఆ ప్రశ్నకి ముందుగా రణబీర్ కపూర్ సమాధానం చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది పడిన తరువాత సందీప్ రెడ్డి వంగా తోనే చేస్తానని చెప్పుకొచ్చాడు. ఆ మాటకి రాజమౌళి కూడా రణబీర్ కపూర్ ని అభినందించడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో క్రింద నెటిజన్లు డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు.

రాజమౌళి స్టేజ్ మీద తనని తాను బెస్ట్ డైరెక్టర్ అని ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు అంటూ కొంతమంది కామెంట్స్ చేశారు. అలాగే రణబీర్ కపూర్ సమాధానం కరెక్ట్ గా ఉందని, నిజాయితీగా చెప్పాదంటూ కితాబు ఇస్తున్నారు. ఇక ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ టాలెంట్ పై రాజమౌళి సైతం ప్రశంసలు కురిపించడం విశేషం.

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సందీప్ రెడ్డితో పాటు రణబీర్ కపూర్ పై ప్రశంసలు కురిపించారు. యానిమల్ ట్రైలర్ చూశానని, ఈ పాత్రని రణబీర్ కపూర్ కాకుండా ఇంకెవరు చేయలేరు అనే విధంగా పెర్ఫార్మెన్స్ ఉందని కొనియాడారు.