Begin typing your search above and press return to search.

SSMB29 : సర్‌ప్రైజ్ ప్లాన్‌ చేస్తున్న జక్కన్న...?

ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినా కూడా పూర్తి అయ్యేందుకు రెండేళ్ల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయట.

By:  Tupaki Desk   |   16 March 2024 3:53 AM GMT
SSMB29 : సర్‌ప్రైజ్ ప్లాన్‌ చేస్తున్న జక్కన్న...?
X

మహేష్ బాబు, రాజమౌళి కాంబో సినిమా కోసం ప్రేక్షకులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. వీరి కాంబో మూవీ కేఎల్‌ నారాయణ నిర్మాణంలో ఎప్పుడో పుష్కర కాలం క్రితం కన్ఫర్మ్‌ అయ్యింది. రాజమౌళి మరియు మహేష్ బాబు ఇద్దరూ కూడా వేరు వేరు ప్రాజెక్ట్‌ లతో బిజీగా ఉండటం వల్ల ఇన్నాళ్లు పట్టాలెక్కలేదు.

బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత రాజమౌళి స్థాయి పాన్ వరల్డ్‌ అయ్యింది. ఇలాంటి సమయంలో మహేష్ బాబుతో ఆయన సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమా కోసం మహేష్ బాబు కొత్త లుక్ ను కూడా ట్రై చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

సినిమా షూటింగ్‌ ప్రారంభం అవ్వడానికి, ముగియడానికి విడుదల అవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినా కూడా పూర్తి అయ్యేందుకు రెండేళ్ల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయట. అంటే సినిమా 2027 లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సినిమా ప్రారంభంకు ముందే దర్శకుడు రాజమౌళి ఫ్యాన్స్ కి సర్‌ ప్రైజింగ్ గిఫ్ట్‌ ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడట. మహేష్ బాబు కొత్త లుక్ కి సంబంధించిన ఫోటో షూట్‌ ను ప్లాన్‌ చేస్తున్నాడట. షూటింగ్‌ కి ముందే ఏదైనా ప్రత్యేక రోజున ఆ ఫోటో షూట్‌ స్టిల్స్ ను ఫ్యాన్స్ ముందు ఉంచే అవకాశాలు ఉన్నాయి.

గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోతున్న సినిమా ఇదే. ఇటీవల ఒక యాడ్‌ షూట్‌ లో మహేష్ బాబు గడ్డం మరియు మీసాలతో పాటు పొడవాటి జుట్టుతో కనిపించి వావ్ అనిపించాడు. లుక్ భలే ఉందే అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట అందుకు సంబంధించిన చర్చ వైరల్‌ అయ్యింది. మహేష్ బాబు తో రాజమౌళి చేయబోతున్న సినిమా రెండు వేల కోట్ల మూవీ అంటూ ఫ్యాన్స్ చాలా ధీమాతో కనిపిస్తున్నారు.