Begin typing your search above and press return to search.

ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వడం రాజమౌళికి అలవాటేగా..!

మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ అని తెలుస్తుంది. ఈ సినిమా కోసమే మహేష్ అక్కడ వాతావరణం అలవాటు చేసుకునేందుకే అక్కడకు వెళ్లాడని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   31 Jan 2024 4:30 AM GMT
ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వడం రాజమౌళికి అలవాటేగా..!
X

మహేష్ తో రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాపై కొత్తగా బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా అనౌన్స్ మెంట్ నుంచి పాన్ వరల్డ్ రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది. ఇక సినిమా పనులు మొదలు పెడుతున్నారని తెలిసి ఫ్యాన్స్ లో జోష్ వచ్చింది. రీసెంట్ గా మహేష్ జర్మనీ వెళ్లింది కూడా జక్కన్న సినిమా కోసమే అని టాక్ వచ్చింది. అనుకున్నట్టుగానే మహేష్ ఫారెస్ట్ లో సర్ ప్రైజ్ ఇచ్చాడు.

మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ అని తెలుస్తుంది. ఈ సినిమా కోసమే మహేష్ అక్కడ వాతావరణం అలవాటు చేసుకునేందుకే అక్కడకు వెళ్లాడని తెలుస్తుంది. ఈ సినిమాలో ఇదివరకు ఎప్పుడు చూడని మహేష్ ని చూపించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు నెవర్ బిఫోర్ యాక్షన్ అడ్వెంచర్ ఎక్స్ పీరియన్స్ అందించేలా యాక్షన్ కొరియోగ్రఫర్స్ ని గైడ్ చేస్తున్నాడు.

SSMB 29 తో రాజమౌళి ఊహించని సర్ ప్రైజ్ లు ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. సినిమా కోసం మేజర్ పార్ట్ అంతా కూడా సాధ్యమైనంత వరకు ఒకటి రెండు షెడ్యూల్ లో జరిగేలా చూస్తున్నాడట. సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ ని హైర్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ దాకా తన టాలెంట్ చూపించిన రాజమౌళి మహేష్ తో హాలీవుడ్ సినిమాలకు ధీటైన సినిమా చేయాలని మైండ్ లో ఫిక్స్ అయ్యాడు. అందుకు తగినట్టుగా మహేష్ లాంటి హీరో దొరికాడు కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుంది అని ఊహించేందుకు కూడా కష్టమే అనిపిస్తుంది. రాజమౌళి నుంచి వస్తున్న అసలు సిసలైన పాన్ వరల్డ్ సినిమాగా సూపర్ స్టార్ మహేష్ 29వ సినిమా త్వరలో షురూ కానుంది. మరి ఈ సినిమా మిగతా డీటైల్స్ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది.

త్వరలో ముహూర్త కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ సినిమా కోసం మొదట వర్క్ షాప్ నిర్వహిస్తారని తెలుస్తుంది. ఆ తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. సినిమాను కె.ఎల్ నారాయణ 300 నుంచి 400 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది. రాజమౌళి కూడా మహేష్ సినిమాను ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్లాలా అన్న ఆసక్తితో ఉన్నారని తెలుస్తుంది.