Begin typing your search above and press return to search.

జక్కన్న.. మళ్ళీ జపాన్ ఎందుకు?

దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో తన తదుపరి ప్రాజెక్టును ఎప్పుడు మొదలుపెడతాడా అని ఫాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు

By:  Tupaki Desk   |   12 March 2024 4:29 PM GMT
జక్కన్న.. మళ్ళీ జపాన్ ఎందుకు?
X

దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో తన తదుపరి ప్రాజెక్టును ఎప్పుడు మొదలుపెడతాడా అని ఫాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. బాహుబలి RRR సినిమాల తరువాత రాజమౌళి నుంచి వస్తున్న SSMB29 మరొక బిగ్ బడ్జెట్ సినిమా కావడంతో కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అంతేకాకుండా హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా RRR సినిమా చూసి రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు. దీంతో వారికి కూడా రాజమౌళి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడా అని ఎదురుచూస్తూ ఉన్నారు అని చెప్పవచ్చు. అసలైతే రాజమౌళి మహేష్ ప్రాజెక్టును ఈపాటికే మొదలు పెట్టాల్సింది. గత ఏడాది డిసెంబర్లో వర్క్ షాప్ కూడా నిర్వహించాలని అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకున్న రాజమౌళి పూర్తిస్థాయిలో పర్ఫెక్ట్ ప్లాన్ సెట్ అయిన తర్వాతనే అసలు పనులు మొదలుపెట్టాలి అని ఫిక్స్ అయ్యారు.

రీసెంట్ గా మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని లుక్స్ లుక్స్ విషయంలో కొంత టెస్ట్ షూట్ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే లోపల ఎంత జరుగుతున్నా కూడా ఈ విషయాన్ని బయటకు లీక్ కానివ్వడం లేదు. వారంలో రెండు మూడు సార్లు అయినా సరే రాజమౌళి మహేష్ సీక్రెట్ గా కలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే కొంతమంది టెక్నీషియన్స్ ను ఫైనల్ చేసిన జక్కన్న పర్ఫెక్ట్ ప్లాన్ తో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు హఠాత్తుగా రాజమౌళి జపాన్ వెళ్లడానికి సిద్ధమయ్యాడు.

అయితే మహేష్ సినిమా కోసం వెళుతున్నాడా అంటే.. అది కాదు. RRR సినిమాకు సంబంధించిన హడావిడి కోసం మళ్ళీ జపాన్ వెళుతున్నట్లుగా తెలుస్తోంది. రాజమౌళి ఇదివరకే రెండు మూడు సార్లు జపాన్ కు వెళ్లడం జరిగింది. అక్కడ ఈ సినిమా గట్టిగానే రికార్డులు క్రియేట్ చేసింది. జపాన్ జనాలు నాటు నాటు పాటకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇక ఇప్పటికీ అక్కడ కొన్నిచోట్ల RRR సినిమా షోలు పడుతున్నాయి. అయితే మార్చి 18వ తేదీన జపాన్ లోని ఒక థియేటర్లో RRR సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ షో ప్రదర్శించబోతున్నారు.

అయితే రాజమౌళి కూడా ఆ జపాన్ షోకి హాజరు కాబోతున్నారు. అక్కడికి పెద్ద ఎత్తున ఆడియన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దీన్ని బట్టి రాజమౌళి ఇంకా మహేష్ బాబుకు సంబంధించిన ప్రాజెక్టు లో పూర్తిస్థాయిలో నిమగ్నం కాలేదని అర్థమవుతుంది. ఒక్కసారి రాజమౌళి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మాత్రం ఇతర విషయాలను పట్టించుకోడు అని చెప్పవచ్చు.

అయితే రాజమౌళి అలా వెళ్లడం వలన ఒక విధంగా మంచిదే అని చెప్పవచ్చు. మహేష్ బాబు ప్రాజెక్ట్ కు కూడా అక్కడ మరింత హైప్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో జక్కన్న జపాన్ వెళ్లడం వలన అతని తదుపరి సినిమా గురించి కూడా అందరూ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. RRR సక్సెస్ తో మహేష్ సినిమాకు అక్కడ మరింత డిమాండ్ పెరిగినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి రాజమౌళి మహేష్ ప్రాజెక్టుతో ఇప్పుడు బిజీ అవుతాడో చూడాలి.