Begin typing your search above and press return to search.

రాజమౌళి లవర్ బాయ్ వేషాలు.. మరొకటి లీక్

తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుడిగా రాజమౌళి తన పేరుని చరిత్రలో నిలిచిపోయేలా చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   11 April 2024 5:34 AM GMT
రాజమౌళి లవర్ బాయ్ వేషాలు.. మరొకటి లీక్
X

తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుడిగా రాజమౌళి తన పేరుని చరిత్రలో నిలిచిపోయేలా చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తో ఇండియన్ సినిమాలు ఆస్కార్ అవార్డులు గెలుచుకోగలవు, గోల్డెన్ గ్లోబ్ వంటి అంతర్జాతీయ అవార్డులని గెలుచుకోవచ్చు అని జక్కన్న నిరూపించారు. అలాగే వందల కోట్ల బడ్జెట్ తో చేసిన సినిమాల కథలో దమ్ముంటే ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్లు వసూళ్లని సాధించవచ్చని బాహుబలి సిరీస్ తో చూపించారు.

ఆయన దారిలో ఇప్పుడు చాలా మంది స్టార్ దర్శకులు నడుస్తూ వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తూ ఉండటం విశేషం. కెరియర్ లో ఇప్పటి వరకు ప్లాప్ లేని దర్శకుడిగా కూడా రాజమౌళి అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయితే రాజమౌళి తనలో ఒక క్రియేటర్ మాత్రమే కాకుండా మంచి యాక్టర్ ఉన్నాడని ఆయన సినిమాలతోనే ప్రూవ్ చేసుకున్నారు.

గెస్ట్ రోల్ చేసిన, తక్కువ నిడివి ఉన్న క్యారెక్టర్స్ చేసిన తనదైన పెర్ఫార్మెన్స్ తో జక్కన్న మెప్పించాడు. రాజమౌళి పూర్తిస్థాయి నటుడిగా కనిపిస్తే చూడాలని చాలా మంది ఆశిస్తున్నారు. అయితే రాజమౌళిలో యాక్టర్ మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా ఉన్నాడని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో బట్టి అర్ధమవుతోంది.

రాజమౌళి కుటుంబంలో ఇటీవల జరిగిన ఓ మ్యారేజ్ సంగీత్ ఈవెంట్ తో భార్య రమతో కలిసి స్టేజ్ మీద జక్కన్న స్టెప్పులేశారు. ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సాంగ్ కి స్టేజ్ పై రమతో కలిసి జక్కన్న రొమాంటిక్ స్టెప్పులతో డాన్స్ చేయడం అందరిని ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది.

అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో కూడా మరింత వైరల్ అవుతోంది. ముందు ఉన్న వారు వారిని ఉత్సాహపరుస్తూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండటం విశేషం. ఈ వీడియోని ఎవరో షూట్ చేసి ట్విట్టర్(ఎక్స్)లో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. రాజమౌళిలో అద్భుతమైన క్రియేటర్ మాత్రమే కాకుండా మంచి ప్రేమికుడు, అంతకుమించి మంచి డాన్సర్ కూడా ఉన్నాడు అంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రాజమౌళి అద్భుతంగా డాన్స్ చేస్తున్నాడని ప్రశంసిస్తున్నారు. ప్రొఫెషనల్ గా వర్క్ ను జక్కన్న ఎంత ప్రేమిస్తాడో కుటుంబాన్ని కూడా అంతే స్థాయిలో ప్రేమిస్తాడని, అతని ఫ్యామిలీ రిలేటివ్స్ కి సంబంధించి ప్రతి ఈవెంట్ లో రాజమౌళి పార్టిసిపేషన్ కచ్చితంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఇక రాజమౌళి నెక్స్ట్ మహేష్ బాబుతో తన పాన్ వరల్డ్ ప్రాజెక్టును స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక త్వరలోనే వర్క్ షాప్ మొదలుపెట్టి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అలాగే రాజమౌళి సినిమా కోసం మహేష్ కూడా ఫిట్నెస్ లో మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.