Begin typing your search above and press return to search.

నానితో సినిమా ప్లానింగ్ లో రాజమౌళి..?

నానితో మరో సినిమా చేయడానికి రాజమౌళి కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నాడని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   11 Aug 2023 8:25 AM GMT
నానితో సినిమా ప్లానింగ్ లో రాజమౌళి..?
X

నేచురల్ స్టార్ నానితో ఒకసారి పనిచేసిన ఎలాంటి డైరెక్టర్ అయినా అతనితో చాలా మంచి రిలేషన్ షిప్ కొనసాగిస్తారు. ఇక స్టార్ డైరెక్టర్స్ అయితే నాని టాలెంట్ గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటారు. నాని తన కెరీర్ లో కొత్త దర్శకులు యువ దర్శకులతో పనిచేయడానికి ఎక్కువ ఇష్టపడతాడు కానీ స్టార్ డైరెక్టర్స్ తో పనిచేయడానికి ఆసక్తి చూపించడు. కొత్త వాళ్లతోనే సూపర్ హిట్లు కొడుతూ తన కెరీర్ సాగిస్తున్నాడు నాని. అయితే నాని కెరీర్ లో ఈగ సినిమా చాలా స్పెషల్ స్థానంలో ఉంటుంది. 2012లో నాని హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కింది.

ఆ సినిమా టైం లో నానికి నేచురల్ స్టార్ ట్యాగ్ లైన్ కూడా లేదు. అయితే రాజమౌళి లాంటి డైరెక్టర్ తో చేయాలనే ఆలోచనతో నాని ఈగ సినిమా చేశాడు. ఆ సినిమాలో నాని ఫస్ట్ హాఫ్ లోనే ఉంటాడు. అయితే రాజమౌళి సినిమాలు చూసే ప్రతి ఒక్కరు నాని ఈగ సినిమాలో ఈగగా వెంటనే గుర్తు పెట్టుకుంటారట. ఈ విషయాన్ని నానినే చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు. నాని ఈగ పార్ట్ 2 చేయాలని ప్లానింగ్ ఉన్నా రాజమౌళి అందుకు రెడీగా లేడని తెలుస్తుంది.

బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో రాజమౌళి తన రేంజ్ పెంచుకున్నాడు. ఇప్పుడు జక్కన్న సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో నాని సినిమా ఉండబోతుందని తెలిసిందే.

అయితే నానితో కూడా రాజమౌళి ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఈగ తర్వాత నాని మజ్ను సినిమాలో రాజమౌళి కెమియో రోల్ చేశారు. నానితో మరో సినిమా చేయడానికి రాజమౌళి కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నాడని తెలుస్తుంది.

అయితే ఈ కాంబో సెట్ అవ్వాలంటే మరో అద్భుతమైన కథ దొరకాల్సిందే. ఇన్నాళ్లు నాని అంటే క్లాస్ హీరోగా ఉన్న ఇమేజ్ ని కాస్త దసరాతో చెరిపేసి మాస్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. సో ఈ కథ నానికి సూట్ అవుతుందా లేదా అన్నది ఒకప్పటి మాట ఎలాంటి కథ అయినా తన మార్క్ నటనతో అలరిస్తున్నాడు నాని.

రాజమౌళితో సినిమా కూడా ఎప్పుడు వస్తుంది అన్నది తెలియదు కానీ రాజమౌళి కూడా నానితో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. మహేష్ సినిమా తర్వాత నానితోనే జక్కన్న మూవీ ఉండొచ్చని టాక్.