Begin typing your search above and press return to search.

వాళ్లు కాకపోతే రాజమౌళి నెక్స్ట్ ఆప్షన్ ఎవరు..?

ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   3 May 2024 4:13 AM GMT
వాళ్లు కాకపోతే రాజమౌళి నెక్స్ట్ ఆప్షన్ ఎవరు..?
X

బాహుబలితో పాన్ ఇండియా.. ఆర్.ఆర్.ఆర్ తో పాన్ వరల్డ్ లెవెల్ లో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన రాజమౌళి తన డైరెక్షన్ లో సినిమా అంటే సరికొత్త సంచలనాలు క్రియేట్ చేస్తుంది అనే బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. రాజమౌళి ముద్ర పడింది అంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండాల్సిందే అనేలా సెంటిమెంట్ ఏర్పడింది. బాహుబలితో రెండు భాగాలుగా ఒక సినిమా చెప్పొచ్చని ప్రూవ్ చేయగా ఇప్పుడు అదే పంథాలో చాలా సినిమాలు వస్తున్నాయి. స్టార్స్ తో రాజమౌళి చేస్తున్న అద్భుతాలు తెలుగు పరిశ్రమకు కనీ విని ఎరుగని రికార్డులను తెచ్చి పెడుతున్నాయి.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా రాబోతుంది. ఇదిలాఉంటే రాజమౌళి తన కెరీర్ లో కేవలం స్టార్స్ తోనే కాదు యువ హీరోలతో కూడా పనిచేశాడు. మొదటి సినిమా చేసినప్పుడు ఎన్.టి.ఆర్ యువ హీరోనే రాజమౌళి తన సినిమాలతో తారక్ ని స్టార్ చేశాడు. ఛత్రపతితో ప్రభాస్ రేంజ్ కూడా పెంచాడు.

స్టార్స్ తోనే కాదు నాని, నితిన్ లాంటి మిడ్ రేంజ్ హీరోలతో కూడా సినిమా చేశాడు రాజమౌళి. నితిన్ తో సై, నానితో ఈగ, సునీల్ తో మర్యాద రామన్న సినిమాలు చేసిన రాజమౌళి ఈగ 2 తీయాలని అనుకుంటున్నారు. ఒకవేళ రాజమౌళి ఫ్యూచర్ లో స్టార్స్ తో కాకుండా మళ్లీ మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేయాలంటే ఈసారి లిస్ట్ లో చాలామంది ఉన్నారనే చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ నుంచి విశ్వక్ సేన్, అడివి శేష్, సిద్దు, నిఖిల్ ఇలా యువ హీరోలంతా కూడా తమ రేంజ్ ని పెంచుకునే సినిమాలతోనే వస్తున్నారు.

రాజమౌళి ఛాన్స్ ఇవ్వాలే కానీ వారు కమిటైన సినిమాలను కూడా పక్కన పెట్టి డేట్స్ ఇచ్చేస్తారు. మహేష్ తర్వాత రాజమౌళి ఎన్.టి.ఆర్ ఆ తర్వాత ప్రభాస్ తో సినిమా చేస్తాడని టాక్. పుష్ప తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ తో కూడా రాజమౌళి సినిమా చేస్తే చూడాలని ఆడియన్స్ కోరుతున్నారు. మరి అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి. కచ్చితంగా ఈ కాంబో సినిమా పడితే మాత్రం నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో కథ కథనాలతో మరోసారి రాజమౌళి తన మార్క్ చూపిస్తాడని చెప్పొచ్చు.