Begin typing your search above and press return to search.

ఆడియన్స్ విష్ కాదు నాగార్జున డ్రీం అది..!

మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మెగా మూవీలో మరో హీరో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి

By:  Tupaki Desk   |   2 Feb 2024 3:30 PM GMT
ఆడియన్స్ విష్ కాదు నాగార్జున డ్రీం అది..!
X

మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మెగా మూవీలో మరో హీరో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. మహేష్ 29వ సినిమాలో నటించే ఆ స్టార్ కింగ్ నాగార్జున అని తెలుస్తుంది. నిజంగానే నాగార్జున మహేష్ జక్కన్న సినిమాలో ఉంటాడా లేదా అన్నది తెలియదు కానీ అది కేవలం ఆడియన్స్ విష్ అని విని ఊరుకోలేం. కచ్చితంగా ఇది నాగార్జున డ్రీం కూడా అవుతుంది. ఎందుకంటే రాజమౌళి సినిమా తీసేది తెలుగులోనే అయినా దాని ప్రభావం వరల్డ్ వైడ్ ఉంటుంది

ఆర్.ఆర్.ఆర్ తోనే ఇంటర్నేషనల్ లెవెల్ లో చర్చ కొనసాగించేలా చేసిన రాజమౌళి. మహేష్ తో చేస్తున్న సినిమా గురించి భారీ ప్లానింగ్ తో ఉన్నాడు. అలాంటి సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా. రాజమౌళి సినిమా ఛాన్స్ అంటే మరో మాట మాట్లాడకుండా ఓకే అనేస్తారు స్టార్స్.

రాజమౌళి సినిమాలో చిన్న పాత్రకు కూడా వెయిట్ ఉంటుంది. స్టార్స్ వారి క్రేజ్ కి తగినట్టుగా సినిమాల్లో వారి పాత్రలను డిజైన్ చేస్తాడు జక్కన్న. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర చిన్నదే అయినా ఆ రోల్ కు ఆయన నిండుతనం తీసుకొచ్చారు. అయితే మహేష్ సినిమాలో నాగార్జున ఉన్నా కింగ్ క్రేజ్ కి తగిన పాత్రనే ఇచ్చేస్తాడని చెప్పొచ్చు.

సో ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమాలో నాగార్జున అన్నది గాలి వార్తే అయినా ఇది నాగార్జున డ్రీం కూడా అయ్యే ఛాన్స్ ఉంది. మహేష్ అంటే కూడా నాగార్జునకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే మహేష్ తో స్క్రీన్ షేర్ చేసేందుకు నాగార్జున అసలు వెనకడుగు వేయడు. మరి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈ కాంబోని నిజం చేస్తే మాత్రం మహేష్ సినిమా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.

ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న మహేష్ రాజమౌళి మూవీ సినిమా లో హాలీవుడ్ టెక్నిషియన్స్ ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుండగా 2026 లో రిలీజ్ ఉంటుందని టాక్. మహేష్ కూడా ఈ సినిమా కోసం సూపర్ ఎగ్జైటెడ్ గా ఉండగా రాజమౌళి పర్ఫెక్ట్ షెడ్యూల్ తో సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. మహేష్ 29 వ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో కాస్టింగ్ ఏంటన్నది తెలుసుకోవాలని ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు.