Begin typing your search above and press return to search.

రాజమౌళి మిస్ చేసుకున్న బాలీవుడ్ ఆఫర్

సల్మాన్ ఖాన్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లో ఇది కూడా ఒకటని చెప్పాలి.

By:  Tupaki Desk   |   25 Feb 2024 5:33 AM GMT
రాజమౌళి మిస్ చేసుకున్న బాలీవుడ్ ఆఫర్
X

హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ హిట్ అయిన మూవీ బజరంగీ భాయ్ జాన్. ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్ కథ అందించారు. ఈ మూవీ హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఏకంగా 600 కోట్ల కలెక్షన్స్ ని ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు చేసింది. సల్మాన్ ఖాన్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లో ఇది కూడా ఒకటని చెప్పాలి.

అయితే నిజానికి ఈ సినిమా రాజమౌళి డైరెక్షన్ చేయాలనే విజయేంద్రప్రసాద్ సిద్ధం చేసారంట. అతను రాసిన ప్రతి కథకి కొడుకు రాజమౌళిని వినిపిస్తూ ఉంటారు. అలాగే బజరంగీ భాయ్ జాన్ కథకి కూడా విజయేంద్రప్రసాద్ జక్కన్నకి వినిపించారట. అరగంట కథ మొత్తం విన్న రాజమౌళి అందులో ఎమోషన్స్ కి కనెక్ట్ అయ్యారు. అయితే ఎవరికైనా ఇచ్చేయాలని అనుకుంటే ఇచ్చేయండి అని చెప్పాడంట.

అప్పటికే విజయేంద్రప్రసాద్ ఆ కథని సల్మాన్ ఖాన్ ని నేరేట్ చేయడం, ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే రాజమౌళి దర్శకత్వం చేస్తే బాగుంటుందని విజయేంద్రప్రసాద్ అనుకున్నారు. కానీ జక్కన్న కాదని అనడంతో కబీర్ సింగ్ చేతికి వెళ్ళింది. మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ మూవీ చూసిన తర్వాత రాజమౌళి బాధపడ్డాడంట.

ఆ కథని ఓ 15 రోజులు ముందుగాని లేదంటే 15 రోజుల తర్వాత కానీ తనకి నేరేట్ చేసి ఉంటే కచ్చితంగా నేనే చేసేవాడిని అని చెప్పారంట. విజయేంద్రప్రసాద్ జక్కన్నకి కథని మిట్టమధ్యాహ్నం నేరేట్ చేసారంట. అదికూడా వేరే వర్క్ మూడ్ లో టెన్షన్ లో ఉన్న సమయంలో చెప్పడంతో ఆ సమయానికి రాజమౌళి వేరేవారికి ఇచ్చేయమని చెప్పారని తెలుస్తోంది. ఈ విషయాన్ని విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

మొత్తానికి అలా బజరంగీ భాయ్ జాన్ సినిమా రాజమౌళి చేతులు నుంచి డ్రాప్ అయిపొయింది. ఒక వేళ జక్కన్న ఈ సినిమా చేసి ఉంటే మాత్రం కచ్చితంగా టాలీవుడ్ స్టార్ హీరోతోనే సిల్వర్ స్క్రీన్ పైకి ఎక్కించేవారు. బాహుబలి కంటే ముందు ఈ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసేవారని మాట వినిపిస్తోంది.