Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్..!

రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది

By:  Tupaki Desk   |   16 Feb 2024 5:25 AM GMT
పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్..!
X

రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ట్రిపుల్ ఆర్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన రాజమౌళి మహేష్ తో చేస్తున్న సినిమాతో మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు. మహేష్ తో చేస్తున్న సినిమా ఇండియన్ సినిమాలా కాకుండా హాలీవుడ్ ట్రీట్ మెంట్ ఉండేలా చూస్తున్నాడట. అందుకోసమే సినిమాకు చాలామంది హాలీవుడ్ టెక్నిషియన్స్ ని హైర్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా విషయంలో రాజమౌళి ప్లాన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని టాక్. సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందే 6 నెలలు వర్క్ షాప్ ప్లాన్ చేశారట. ఈ వర్క్ షాప్ లో సినిమా లో నటించే స్టార్ కాస్ట్ అంతా కూడా పాల్గొంటారని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇండోనేషియా బ్యూటీ చెస్లియా ఇస్లాన్ ని ఎంపిక చేశారని టాక్. అయితే హీరోయిన్ ఎంపిక గురించి మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.

మహేష్ రాజమౌళి ఈ కాంబినేషన్ అంచనాలకు తగినట్టుగానే ఈ ప్రాజెక్ట్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. ఫారెస్ట్ అడ్వెంచర్ గా భారీ యాక్షన్ సీన్స్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో మహేష్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా లుక్ కోసం మహేష్ మేకోవర్ మొదలు పెట్టాడు. సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ లో కూడా మహేష్ యాక్టివ్ గా పాల్గొంటాదని తెలుస్తుంది.

ఎస్.ఎస్.ఆర్.ఎం.బి గా రాబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా సినిమాలా కాకుండా పాన్ వరల్డ్ సినిమాగా దీన్ని ప్లాన్ చేస్తున్నారట. తప్పకుండా ఈ మూవీ ఇప్పటివరకు వచ్చిన ఇండియన్ సినిమాల రికార్డులన్ని తిరగరాసేలా రాజమౌళి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ మూవీ గురించి మరిన్ని డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. సినిమా లో నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను సూపర్ విజువల్ ఫీస్ట్ అందించేలా చూస్తున్నారు. సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.