Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న ప్రాజెక్ట్ కోసం మ‌హేష్ అంత‌ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడా?

ఈ భారీ పాన్ ఇండియా సినిమా త‌రువాత రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మ‌హేష్‌తో భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌ని తెర‌కెక్కించ‌నున్న విష‌యం తెలిసిందే

By:  Tupaki Desk   |   18 Oct 2023 8:17 AM GMT
జ‌క్క‌న్న ప్రాజెక్ట్ కోసం మ‌హేష్ అంత‌ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడా?
X

జ‌క్క‌న్న చెక్కిన‌ పాన్ ఇండియా అద్భుతం 'ఆర్ ఆర్ ఆర్‌'. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల తొలి క‌ల‌యిక‌లో ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా వండ‌ర్స్ క్రియేట్ చేసింది. వెయ్యి కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే కాకుండా భార‌తీయ సినిమాకు ఓ క‌ల‌గా మారిన ఆస్కార్ అవార్డుని అందించి చ‌రిత్ర సృష్టించింది. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో తొలి సారి ఆస్కార్‌ని ద‌క్కించుకున్న తొలి తెలుగు సినిమాగా స‌రికొత్త రికార్డుని క్రియేట్ చేసి వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు సినిమా హాట్ టాపిక్ అయ్యేలా చేసింది.

ఈ భారీ పాన్ ఇండియా సినిమా త‌రువాత రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మ‌హేష్‌తో భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌ని తెర‌కెక్కించ‌నున్న విష‌యం తెలిసిందే. SSMB29 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌పైకి రానున్న ఈ మూవీకి విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. అస్ట్రేలియా అడ‌వుల నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌గా రూపొంద‌నున్నఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యిందిని తెలుస్తోంది. ఈ మూవీని ఫ్రాంచైజీలుగా జ‌క్క‌న్న తెర‌పైకి తీసుకురానున్నారంటూ కొన్ని నెల‌లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

రాజ‌మౌళి సినిమా అంటే హీరోలు ప్ర‌త్యేకంగా ఫిట్‌గా ఉండాలి. అందు కోసం ఇప్ప‌టి నుంచే ఫిట్ నెస్ కోసం మ‌హేష్ క‌స‌ర‌త్తులు చేస్తూ న్యూ లుక్ కోసం ట్రై చేస్తున్నారు. రీసెంట్‌గా హ‌లో మ్యాగ‌జైన్ కోసం మ‌హేష్ విడుద‌ల చేసిన ఫొటోలు ఆక‌ట్టుకుంటూ జ‌క్క‌న్న ప్రాజెక్ట్‌పై అంచ‌నాల్ని పెంచేశాయి. ఈ సినిమాలో మ‌హేష్ న్యూలుక్‌లో చాలా ఫిట్‌గా క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే మ‌హేష్ క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్ప‌టికే హాలీవుడ్‌కు చెందిన ఓ సంస్థ ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ని మొద‌లు పెట్టింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమా కోసం మ‌హేష్ బాబు క‌ళ్లు చెదిరే పారితోషికం తీసుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మ‌హేష్ పారితోషికంగా రూ.110 కోట్లు తీసుకుంటున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది. ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాలంటే ఈ ప్రాజెక్ట్ మొద‌ల‌య్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.