Begin typing your search above and press return to search.

ఇంకా ఎన్ని రోజులు జక్కన్న?

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ జక్కన్నతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   17 Aug 2023 4:27 AM GMT
ఇంకా ఎన్ని రోజులు జక్కన్న?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ జక్కన్నతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ విజయేంద్రప్రసాద్ టీమ్ చేస్తోంది. ఈ ఏడాది ఆఖరులో రాజమౌళి సూపర్ స్టార్ తో చేయబోయే సినిమాకి సంబందించి రిహార్శల్స్ స్టార్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పటి వరకైతే మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సెలబ్రేషన్స్ అయిపోయి చాలా రోజులు గడిచిపోయింది. కానీ ప్రస్తుతం ప్రాజెక్ట్ ఏ దశలో ఉందనేదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరుకారం సినిమా చేస్తున్నాడు. అయితే అభిమానులకి గుంటూరు కారం కంటే జక్కన్న సినిమాకి సంబందించిన న్యూస్ పైనే ఎక్కువ ఆసక్తి ఉంది. అందుకే ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు జక్కన్నని ట్యాగ్ చేసి మరి SSMB29 అప్డేట్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు.

తాజాగా రాజమౌళి బాహుబలి 1 మూవీకి సంబందించిన జ్ఞాపకాలని ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. శోభు యార్లగడ్డ, రాఘవేంద్రరావు, రాజమౌళి కలిసి దిగిన ఫోటోని పెట్టారు. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో బాహుబలి ది బిగినింగ్ మ్యాజికల్ స్క్రీనింగ్ ఇప్పటికీ నాకు గుర్తుడిపోతుంది. ఇప్పుడు మరోసారి ఆగస్ట్ 18న స్టావాంజర్ ఒపెరా హౌస్‌లో నార్వేలో బాహుబలి-1 కచేరీ స్క్రీనింగ్‌లో స్టావాంజర్ సింఫనీ ఆర్కెస్ట్రా ప్రదర్శన జరగనుంది. దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము అని ట్వీట్ చేశారు.

శుక్రవారం జరగబోయే ఈ మ్యూజికల్ ఆర్కెస్ట్రా ప్రదర్శనలో పాల్గొనడానికి రాజమౌళి, శోభు, రాఘవేంద్రరావు నార్వే వెళ్లారు. అయితే ఈ ఫోటో క్రింద సూపర్ స్టార్ అభిమానులు మా హీరో మూవీకి సంబందించిన అప్డేట్ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తూ ఉండటం విశేషం. అదే సమయంలో డార్లింగ్ ప్రభాస్ అభిమానులు పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.

బాహుబలి మూవీ వచ్చి ఇన్నేళ్ల తర్వాత ప్రభాస్ మానియా ప్రపంచం మొత్తం అలాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సి చేయబోయే సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని వారి నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అర్ధమవుతోంది.