Begin typing your search above and press return to search.

రాజమౌళి ఒకటి రెండు నుంచి 20 కి పెంచేశాడు..!

ఇప్పటికే వీరి కాంబో సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయ్యింది.

By:  Tupaki Desk   |   5 March 2024 9:27 AM GMT
రాజమౌళి ఒకటి రెండు నుంచి 20 కి పెంచేశాడు..!
X

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి బ్యాక్ టు బ్యాక్‌ బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని, స్టామినాను చాటిన విషయం తెల్సిందే. జక్కన్న తదుపరి సినిమా సూపర్ స్టార్‌ మహేష్ బాబుతో ఉండబోతుంది. ఇప్పటికే వీరి కాంబో సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయ్యింది.

సాధారణంగా రాజమౌళి సినిమాలు విదేశీ షెడ్యూల్ చాలా తక్కువ ఉంటాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఉక్రెయిన్‌ తో పాటు మరో దేశం వెళ్లిన రాజమౌళి బాహుబలి కోసం కూడా పెద్దగా విదేశాల్లో చిత్రీకరణ చేసిందే లేదు. అంతకు ముందు రాజమౌళి తీసిన సినిమాల్లో కూడా ఎక్కువ శాతం విదేశాలకు వెళ్లలేదు.

ఈసారి మహేష్ బాబు సినిమా కోసం మాత్రం రాజమౌళి తన టీం ను ఏకంగా 20 దేశాలకు తిప్పబోతున్నాడని సమాచారం అందుతోంది. మహేష్ బాబుతో తీయబోతున్న సినిమా కాన్సెప్ట్‌ నేపథ్యంలో విదేశాల్లో ఎక్కువగా చిత్రీకరణ చేయాల్సి ఉంటుందట. భారీ సెట్టింగ్స్ కాకుండా ఈసారి విదేశీ లొకేషన్స్ లో సినిమాను విజువల్ వండర్‌ గా రూపొందించబోతున్నాడట.

ఇన్నాళ్లు తన సినిమాల కోసం ఒకటి రెండు దేశాల్లో మాత్రమే చిత్రీకరణ జరిపిన రాజమౌళి ఈసారి ఏకంగా 20 దేశాలకు వెళ్లబోతున్న నేపథ్యంలో ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. ఆకట్టుకునే కథ మరియు కథనం ను ఇప్పటికే రాజమౌళి మరియు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ రెడీ చేశారు.

ఈసారి రాజమౌళి నుంచి వచ్చే సినిమా కచ్చితంగా హాలీవుడ్‌ సినిమాల రేంజ్‌ లో ఉండబోతుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది జూన్ లో మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మహేష్ బాబు లుక్స్ కు సంబంధించిన టెస్ట్‌ పూర్తి అయ్యింది. గడ్డం మరియు పొడవైన జుట్టుతో మహేష్ బాబు కనిపించబోతున్నాడట.