Begin typing your search above and press return to search.

జక్కన్న.. మళ్లీ అదే ఫ్యాక్టరీలో..

తెలుగు సినీ చరిత్రలో అపజయం ఎరగని దర్శకుడిగా రాజముద్ర వేశారు ఎస్ ఎస్ రాజమౌళి.

By:  Tupaki Desk   |   17 March 2024 3:30 PM GMT
జక్కన్న.. మళ్లీ అదే ఫ్యాక్టరీలో..
X

తెలుగు సినీ చరిత్రలో అపజయం ఎరగని దర్శకుడిగా రాజముద్ర వేశారు ఎస్ ఎస్ రాజమౌళి. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ హిట్ కొట్టిన ఈ దర్శకధీరుడు.. తన నెక్స్ట్ సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చిన నుంచి ఫ్యాన్స్.. రోజురోజుకు అంచనాలను పెంచుకుంటూ పోతున్నారు. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు.

రెండేళ్ల క్రితం వచ్చిన ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండనుందని, మహేశ్ తో పాటు మరో టాప్ హీరో నటిస్తున్నారని, ఇండోనేషియా భామ హీరోయిన్ గా ఎంపికైందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తూనే ఉంది.

అయితే రాజమౌళి చిత్రాల్లో విజువల్ ఫీస్ట్ కు కొదవ ఉండదని చెప్పవచ్చు. ఆయన సినిమాల్లోని సెట్స్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తారు. అందులోనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు జక్కన్న. బాహుబలి రెండు పార్టుల కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేయించారు రాజమౌళి. ఆ సెట్ ఇప్పటికే ఇంకా అలానే ఉంది. విజిటర్స్ పోటీపడి మరీ బాహుబలి సామ్రాజ్యాన్ని చూస్తుంటారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ కోసం కూాడా హైదరాబాద్ లోనే సెట్ రూపొందించారు.

గచ్చిబౌలి దగ్గరలోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాలోని మెయిన్ పార్ట్ అంతా షూట్ చేశారు. ఫ్యాక్టరీలో కొంత భాగాన్ని లీజుకు తీసుకుని మరీ సెట్ ను నిర్మించారు. ప్రస్తుతం అక్కడే మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మే చివరి నాటికి ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అవుతుందని, జూన్ లో ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరగనుందట.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాదే ఈ మూవీ కూడా కథ అందించారు. ఇప్పటికే ఆయన ఈ సినిమా గురించి పలు అప్డేట్లు ఇచ్చారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం తన టెక్నికల్ టీమ్ లో జక్కన్న భారీ మార్పులు చేశారట. కొందరిని రీప్లేస్ చేశారట. మరి ఈ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.