Begin typing your search above and press return to search.

ఈసారి గట్టిగా ఫిక్సైన రాజమౌళి..!

RRR తర్వాత రాజమౌళి చేయబోతున్న మహేష్ సినిమా గురించి రీసెంట్ గా జపాన్ లో ఎక్స్ క్లూజివ్ డీటైల్స్ చెప్పాడు జక్కన్న.

By:  Tupaki Desk   |   21 March 2024 4:25 AM GMT
ఈసారి గట్టిగా ఫిక్సైన రాజమౌళి..!
X

RRR తర్వాత రాజమౌళి చేయబోతున్న మహేష్ సినిమా గురించి రీసెంట్ గా జపాన్ లో ఎక్స్ క్లూజివ్ డీటైల్స్ చెప్పాడు జక్కన్న. RRR స్పెషల్ ప్రీమియర్ లో పాల్గొన్న రాజమౌళి తన నెక్స్ట్ సినిమా మహేష్ తో చేస్తున్నానని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని. సినిమా స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయ్యిందని.. త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని అన్నాడు. అంతేకాదు ఈ సినిమా త్వరగా పూర్తి చేస్తామని చెప్పాడు రాజమౌళి.

కామన్ గా అయితే రాజమౌళి తన సినిమా మొదలు పెడితే ఎప్పుడు పూర్తి చేస్తాడు అన్నది ఆయనకు కూడా తెలియదు. సినిమాను తను అనుకున్న విధంగా అవుట్ పుట్ వచ్చే వరకు రాజమౌళి చెక్కుతూనే ఉంటాడు. అందుకే ఆయన సినిమా అంటే కనీసం తక్కువలో తక్కువ 3 ఏళ్లు టైం తీసుకోవాల్సిందే అనుకుంటారు. పాన్ ఇండియా సినిమాలు చేయని టైం లో ప్రతి సినిమాకు 2 ఏళ్లు టైం తీసుకునే రాజమౌళి ఇప్పుడు మరో ఏడాది ఎక్కువ టైం తీసుకుంటున్నాడు.

బాహుబలి నుంచి రాజమౌళి సినిమాల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకోవడంతో ఆయన మరింత జాగ్రత్త పడుతున్నాడు. RRR తర్వాత రాజమౌళి చేస్తున్న మహేష్ సినిమాను మాత్రం త్వరగా పూర్తి చేస్తామని అంటున్నారు. జక్కన్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా రెండేళ్లలో పూర్తి చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో మహేష్ మేకోవర్ అదిరిపోతుందని అంటున్నారు.

ఈ సినిమా నిర్మాణంలో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా భాగస్వామ్యం అవుతుందని అంటున్నారు. సో మహేష్ తో రాజమౌళి చేసే సినిమా హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉండబోతుందని చెప్పకనే చెబుతున్నారు. ఆ రేంజ్ లో సినిమా ఉండాలంటే కాస్త ఎక్కువ టైం తీసుకున్నా పర్లేదని ఆడియన్స్ భావిస్తున్నారు. మరి మహేష్ 29వ సినిమాను రాజమౌళి అనుకున్న విధంగా త్వరగా పూర్తి చేస్తాడా.. 2024 జూన్ లో స్టార్ట్ అవుతున్న ఈ సినిమా 2026 లో రిలీజ్ సాధ్యమేనా అన్నది చూడాలి. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తారని తెలుస్తుండగా.. సినిమాలో హీరోయిన్ మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది త్వరలో రాజమౌళి మహేష్ ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమ అప్డేట్స్ కోసం గ్లోబల్ వైడ్ గా ఉన్న సినీ ప్రేక్షకులు ఈగర్ గా ఉన్నారు.