Begin typing your search above and press return to search.

రాజమౌళి క్యామియో రోల్స్ చేసిన మూవీస్ ఏంటో తెలుసా?

అలా రాజమౌళి కూడా ఇప్పటి వరకు ఎనిమిది చిత్రాలలో క్యామియో రోల్స్ చేశారంటే నమ్మడం కష్టం. అయితే అతను నటించిన సినిమాలలో చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి కూడా.

By:  Tupaki Desk   |   21 Jan 2024 4:14 AM GMT
రాజమౌళి క్యామియో రోల్స్ చేసిన మూవీస్ ఏంటో తెలుసా?
X

ప్రపంచ మెచ్చిన ఇండియన్ దర్శకుడిగా రాజమౌళి ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం హాలీవుడ్ సైతం ఆసక్తిగా ఎదురుచూసేలా చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియాకి ఆస్కార్ తీసుకొచ్చారు. ఇండియాలోనే ఈ తరం దిగ్గజ దర్శకుడిగా కేవలం 11 సినిమాలతోనే రాజమౌళి ప్రూవ్ చేసుకున్నారు.

కథ రాయకపోయిన మేకింగ్ పరంగా తనను కొట్టేవారే లేరని జక్కన్న ప్రతి సినిమాకి ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ప్రతి దర్శకుడిలో కూడా ఒక నటుడు ఉంటాడనే సంగతి తెలిసిందే. అతను తెరపై చూపించే పాత్రల ఎమోషన్స్ ని ఆఫ్ స్క్రీన్ లో క్యారెక్టర్స్ పోషించేవారికి చేసి చూపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తమకున్న యాక్టింగ్ ఇంటరెస్ట్ ని వెండితెరపై క్యామియో రోల్స్ ద్వారా చూపిస్తారు.

అలా రాజమౌళి కూడా ఇప్పటి వరకు ఎనిమిది చిత్రాలలో క్యామియో రోల్స్ చేశారంటే నమ్మడం కష్టం. అయితే అతను నటించిన సినిమాలలో చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి కూడా. ఆరంభంలో సై సినిమాలో నల్లబాలు వేణు మాధవ్ అనుచరుడిగా రాజమౌళి కాసేపు కనిపిస్తారు. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. తర్వాత రెయిన్ బో అనే సినిమాలో చేశారు. అలాగే మగధీర చిత్రంలో సాంగ్ లో తళుక్కున మెరిసి పోతారు.

ఈగ సినిమా ఆరంభంలో కూతురుకి స్టోరీ నేరేట్ చేసేది రాజమౌళినే. బాహుబలి సినిమాలో సారా అమ్మే వాడిగా కాసేపు కనిపిస్తాడు. నాని మజ్ను మూవీలో కూడా తన ఒరిజినల్ క్యారెక్టర్ లోనే నటించాడు. రాధేశ్యామ్ మూవీ కథని ప్రారంభించేది కూడా రాజమౌళి పాత్రతోనే. ఆర్ఆర్ఆర్ లో ఎత్తర జెండా సాంగ్ లో కనిపించారు. ఇలా రాజమౌళి కనిపించిన సినిమాలలో మేగ్జిమమ్ సూపర్ హిట్ అయినవి, ఆయన దర్శకత్వంలో వచ్చినవే.

ఒక మూడు సినిమాలు మాత్రం వేరొకరి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు వాటిలో రెయిన్ బో, రాధేశ్యామ్ సినిమాలు డిజాస్టర్ కాగా, నాని మజ్ను మూవీ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అయితే రాజమౌళి పూర్తి నిడివి ఉన్న పాత్రలో ఒక్క సినిమాలో అయిన నటిస్తే చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.