Begin typing your search above and press return to search.

రాజమౌళికి.. ఆ యాక్టర్లపై అసూయేనా..?

ఈ సందర్భంగా ప్రేమలు హీరోయిన్ మమితను ప్రశంసించారు జక్కన్న. గీతాంజలి ఫేం గిరిజ, సాయిపల్లవిలా మమిత కూడా యూత్ కు హార్ట్ త్రోబ్ అవుతుందని అన్నారు.

By:  Tupaki Desk   |   13 March 2024 7:22 AM GMT
రాజమౌళికి.. ఆ యాక్టర్లపై అసూయేనా..?
X

మలయాళం సూపర్ హిట్ మూవీ ప్రేమలు.. ఇటీవల తెలుగులో రిలీజైన విషయం తెలిసిందే. రాజమౌళి కుమారుడు కార్తికేయ.. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోకి తీసుకొచ్చారు.

తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకక రాజమౌళి, కీరవాణి, అనిల్ రావిపూడి, అనుదీప్ సహా పలువురు అతిథులుగా విచ్చేశారు. ప్రేమలు మూవీ టీం కూడా వచ్చింది. ఇక యాంకర్ సుమ.. ఈ వేడుకలో అటు తెలుగులో ఇటు మలయాళంలో మాట్లాడుతూ అదరగొట్టేసింది. ప్రేమలు నటీనటులతో మలయాళంలో ముచ్చటించింది. ఇక రాజమౌళి వేడుకనుద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రేమలు హీరోయిన్ మమితను ప్రశంసించారు జక్కన్న. గీతాంజలి ఫేం గిరిజ, సాయిపల్లవిలా మమిత కూడా యూత్ కు హార్ట్ త్రోబ్ అవుతుందని అన్నారు. అసూయ, బాధతో అంగీకరించాల్సిన విషయం ఏంటంటే.. మలయాళీ నటులంతా చక్కగా నటిస్తారని చెప్పారు. మాలీవుడ్ నుంచి మంచి నటీనటులు వెలుగులో వస్తున్నారని అంగీకరించారు.

సాధారణంగా లవ్ స్టోరీలు, రొమాంటిక్ కామెడీ చిత్రాలు తనకు నచ్చవని, తన దృష్టంతా యాక్షన్, ఫైట్లపైనే ఉంటుందని రాజమౌళి చెప్పారు. మాలీవుడ్ హిట్ మూవీ ప్రేమలును తెలుగులో రిలీజ్ చేస్తానని కార్తికేయ చెప్పగానే జస్ట్ ఓకే చెప్పానని, కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పారు. ఇక ఇంట్రెస్ట్‌ లేకుండానే సినిమా చూసేందుకు థియేటర్‌ కు వెళ్లానని తెలిపారు.

అయితే సినిమాకు వెళ్లాక తొలి 15 నిమిషాల తర్వాత నుంచి చివరి వరకు కూడా మూవీ చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నానని చెప్పారు. ఇది కచ్చితంగా థియేటర్లలోనే చూడాల్సిన చిత్రమని, మొబైల్ లో చూస్తే ఆనందించలేమని తెలిపారు. అయితే ఆ నవ్వుల క్రెడిట్ అంతా ఆదిత్య హాసన్ దేనని చెప్పారు. తెలుగు వెర్షన్ లో ఆదిత్య డైలాగులు అద్భుతంగా రాశారని ప్రశంసించారు.

ప్రతి పాత్రను మేకర్స్ అద్భుతంగా డిజైన్ చేశారని కొనియాడారు. స్లేన్‌, మ్యాథ్యూ థామస్‌, మమిత బైజు సహా ప్రధాన పాత్రల్లో నటించిన వారందరిపై ప్రశంసలు కురిపించారు. ఒక మంచి మూవీని భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ ప్రేక్షకులు ఆదరస్తారని మరోసారి రుజువైందని గుర్తుచేశారు. ఇప్పటికే మాలీవుడ్ కు చెందిన అనేక మంది డైరెక్టర్లు మంచి పేరు సంపాదించారని, మీరు కూడా అదే కొనసాగిస్తున్నారని గిరీష్‌ ఏడీని జక్కన్న ప్రశంసించారు.