రాజమౌళి బలాన్ని పూరీ ఎలా వాడుకుంటాడో..?
అలా చెప్పినా పూరీ అలా చేస్తాడా అని అనుకున్నారు అందరు. కానీ పూరీ లేటెస్ట్ మూవీ కోసం విజయేంద్ర ప్రసాద్ హ్యాండ్ కూడా పడబోతుందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 1 Jun 2025 6:00 AM ISTదర్శకధీరుడు రాజమౌళి ఓటమి ఎరుగని దర్శకుడిగా సక్సెస్ మేనియా కొనసాగిస్తున్నాడు అంటే ఆయన వెనకాల విజయేంద్ర ప్రసాద్ అనే బలం ఉంది. ఆయన కథ రాయడం దాన్ని జక్కన్న తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టడం ఇది రిపీట్ మోడ్ అన్నట్టుగా వారి సినిమాల ఫలితాలు ఉన్నాయి. ఒక సినిమా నెక్స్ట్ దానికి మించిన సినిమా ఇలా తండ్రి కథ తో రాజమౌళి దర్శకత్వ ప్రతిభ యాడ్ అయ్యి తెలుగు సినిమా కాదు ఇది పాన్ ఇండియా బొమ్మ అనిపించేలా చేశారు.
ఐతే రాజమౌళి సినిమా అంటే విజయేంద్ర ప్రసాద్ కథ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆయన కథ స్క్రీన్ ప్లే అందించడం వల్ల సినిమాకు కొండంత బలం ఏర్పడుతుంది. కథ విషయంలో రాజమౌళి అంత రిలాక్స్ గా ఉన్నాడు అంటే అది తండ్రి విజయేంద్ర ప్రసాద్ మీద ఉన్న నమ్మకం అని చెప్పొచ్చు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అద్భుతాలు చేస్తున్నారు.
ఇక రాజమౌళి బలమైన విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు పూరీ దగ్గరకు వచ్చాడు. అదేంటి ఆయనెలా పూరీకి కనెక్ట్ అవుతాడు అనుకోవచ్చు. కొద్దిగా వెనక్కి వెళ్తే పూరీ డైరెక్షన్ ఆయన సినిమాల స్టామినా అవి సృష్టించిన సంచలనాలకు అందరు ప్రత్యక్ష సాక్ష్యులే. అందులో విజయేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. అలాంటి పూరీ వరుస ఫ్లాపులు ఇవ్వడం ఆయనకు నచ్చలేదు. అందుకే పూరీ సినిమా చేసే ముందు ఒకసారి తనకు కాల్ చేయమని ఒక ఈవెంట్ లో చెప్పారు.
అలా చెప్పినా పూరీ అలా చేస్తాడా అని అనుకున్నారు అందరు. కానీ పూరీ లేటెస్ట్ మూవీ కోసం విజయేంద్ర ప్రసాద్ హ్యాండ్ కూడా పడబోతుందని తెలుస్తుంది. పూరీ డైరెక్షన్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా బెగ్గర్ సినిమా వస్తుంది. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కూడా పనిచేస్తున్నాడా అన్న డౌట్ మొదలైంది. రీసెంట్ గా విజయేంద్ర ప్రసాద్ పూరీ కలిసి దిగిన ఫోటో వైరల్ అవడంతో అందరికీ ఇదే ఆలోచన వస్తుంది.
మరి రాజమౌళి బలాన్ని పూరీ ఎలా వాడుకుంటాడు.. ఎలా సద్వినియోగ పరచుకుంటాడు అన్నది చూడాలి. బెగ్గర్ విషయంలో పూరీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడు. మరి ఈ సినిమా పూరీని కంబ్యాక్ అయ్యేలా చేస్తుందా అన్నది చూడాలి.
