రాజమౌళికి యంగ్ డైరెక్టర్ షాక్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల తొల కలయికలో జక్కన్న తెరకెక్కించిన పాన్ ఇండియా వండర్ `RRR`.
By: Tupaki Desk | 11 July 2025 4:00 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల తొలి కలయికలో జక్కన్న తెరకెక్కించిన పాన్ ఇండియా వండర్ `RRR`. వరల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ మూవీ ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇండియాతో దోబూచులాడిన ఆస్కార్‌ని సైతం దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఇండియన్ సినీ హిస్టరీలో ఆస్కార్‌ని సాధించిన సినిమాగా సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇలాంటి మూవీ తరువాత జక్కన్న అత్యంత భారీ స్థాయిలో సూపర్ స్టార్ మహేష్‌తో భారీ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఇందులో మహేష్‌కు జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి కొంత మంది హాలీవుడ్ నటీనటులతో పాటు ఆర్. మాధవన్ కూడా ఇందులో నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పలు హాలీవుడ్ టెక్నీషియన్‌లతో పాటు క్రేజీ వీఎఫ్ ఎక్స్ కంపనీలు పని చేస్తున్న ఈ మూవీ షూటింగ్ జక్కన్న గత చిత్రాలకు భిన్నంగా రాకెట్ స్పీడుతో జరుగుతోంది.
ఇప్పటికే పలు కీలక షెడ్యూళ్లని పూర్తి చేసిన జక్కన్న ఈ మూవీని త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. సింధూ లోయ, వారణాసికి ఉన్న అనుబంధం నేపథ్యంలో చారిత్రకాంశాల్ని మేళవించి ఓ డివోషనల్ యాక్షన్ అడ్వెంచర్‌గా దీన్ని రాజమౌళి తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జక్కన్నకు ఓ యంగ్ డైరెక్టర్ షాక్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఈ భారీ పాన్ వరల్డ్ మూవీకి కథ డిమాండ్ మేరకు `వారణాసి` టైటిల్‌ని రాజమౌళి అనుకున్నారట.
అయితే ఆ టైటిల్‌ని ఇప్పటికే ఓ యంగ్ డైరెక్టర్ రిజిస్టర్ చేయించుకోవడమే కాకుండా దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్టోరీ డిమాండ్ మేరకు యంగ్ డైరెక్టర్ సినిమాకు `వారణాసి` యాప్ట్ టైటిల్ అట. విషయం తెలుసుకున్న రాజమౌళి ..మహేష్ మూవీ టైటిల్ కోసం సదరు యంగ్ డైరెక్టర్‌ని సంప్రదించి టైటిల్ కావాలని అడిగాడట. అయితే యంగ్ డైరెక్టర్ `వారణాసి` టైటిల్ ఇవ్వడానికి అంగీకరించలేదని, ఎంత డబ్బు ఆఫర్ చేసినా టైటిల్ ఇచ్చేది లేదని ఖరాకండీగా చెప్పాడని ఇన్ సైడ్ టాక్.
ఇంతకీ జక్కన్నకు టైటిల్ విషయంలో షాక్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరో కాదు సుబ్బారెడ్డి. ఆది సాయికుమార్‌తో `రఫ్` మూవీని తెరకెక్కించిన సీ.హెచ్. సుబ్బారెడ్డి ప్రస్తుతం ఓ యంగ్ హీరోతో భారీ బడ్జెట్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. రూ.40 కోట్లతో తెరకెక్కుతున్న ఈ మూవీకి `వారణాసి` టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఇదే జక్కన్న కావాలని అడిగి భంగపాటుకు గురి కావడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
