జక్కన్న 'వారణాసి'లో మరిన్ని సర్‌ప్రైజ్‌లు!
జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మైథలాజికల్, టైమ్ ట్రావెల్ యాక్షన్ డ్రామా `వారణాసి`.
By: Tupaki Desk | 9 Feb 2026 10:44 PM ISTజక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మైథలాజికల్, టైమ్ ట్రావెల్ యాక్షన్ డ్రామా `వారణాసి`. సూపర్‌స్టార్ మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కుభ పాత్రలో కనిపించి సర్‌పైజ్ చేయబోతున్నాడు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలోని మరో కీలక పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో పాన్ వరల్డ్ మూవీగా 2027, ఏప్రిల్ 7న రిలీజ్ చేయబోతున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఊహకందని విధంగా టైమ్ ట్రావెల్ యాక్షన్ డ్రామాకు మైథలాజికల్ అంశాలని జోడించి దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నట్టుగా స్పష్టతనిచ్చింది. అయితే రెగ్యులర్ రాజమౌళి మార్కు సినిమాకు పూర్తి భిన్నంగా దీన్ని సరికొత్త టెక్నాలజీతో హాలీవుడ్ టెక్నీషియన్‌లతో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రుద్రగా మహేష్ కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే త్రేతాయుగంలో శ్రీరాముడిగా కూడా మహేష్ కనిపించనుండటంతో అందిరిలోనూ ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి ఏర్పడింది.
అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ మూవదీని ఐమ్యాక్స్ ఫార్మాట్లో అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకులకు అందించబోతున్నారు. మైథాలజీకి సంబంధించిన కీలక ఘట్టాలు సినిమాకు ప్రధాన హైటైట్‌గా నిలుస్తాయని, రామాయణంలోని పతాక ఘట్టాల్లో మహేష్ శ్రీరాముడిగా కనిపించి సర్ప్రైజ్ చేయబోతున్నాడని ఇప్పటికే బయటికొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో మహేష్ నటిస్తున్న రుద్ర, శ్రీరాముడి క్యారెక్టర్లతో పాటు మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇందులో ఉన్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే కుభ క్యారెక్టర్‌లో విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ తనదైన మార్కు విలనిజంతో వన్ ఆఫ్ ద హైలైట్‌గా నిలవనుండగా ఇందులో మరో మూడు కీలక పాత్రలు ఉన్నాయని, అవి కూడా ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌కు గురి చేస్తాయని ఇన్ సైడ్ టాక్. ఇంతకీ ఆ క్యారెక్టర్స్ ఏంటంటే సృష్టిలయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులట. ఈ క్యారెక్టర్లలో ఎవరు కనిపిస్తారన్నది మాత్రం ఇప్పటి వరకైతే సస్పెన్స్ అని తెలుస్తోంది. ఇక వీటికితోడు మరో కీలకమైన క్యారెక్టర్ కూడా ఉందని, అది అఘోరా క్యారెక్టర్ అని తెలిసింది.
ఆ క్యారెక్టర్‌లో ఎవరు కనిపిస్తారన్నది మాత్రం తెలియరాలేదు. ఆ క్యారెక్టర్‌లో ప్రముఖ నటుడిని దించేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పాత్రల్లో ప్రముఖ నటులని దించేస్తే ఆ వైబే వేరుగా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. పడవ ఫైట్‌ని షూట్ చేస్తున్నారట. విలన్ ఎంట్రీకి సంబంధించిన సీన్ ఇదిని తెలుస్తోంది. ప్రియాంక చోప్రాకు సంబంధించిన షెడ్యూల్ కూడా దాదాపుగా పూర్తి చేసినట్టుగా ఇన్ సైడ్ టాక్.
